E-Paper
Advertisement

విమానం హైజాకింగ్‌తో మొదలై రక్త పిశాచిగా టర్న్… నెవర్ బిఫోర్ కథ మావా

విమానం హైజాకింగ్‌తో మొదలై రక్త పిశాచిగా టర్న్… నెవర్ బిఫోర్ కథ మావా
Advertisement

Horror Thriller OTT : వీకెండ్ రాబోతోంది. కొందరు తమ కుటుంబాలతో కలిసి బయటకు వెళ్లడానికి ప్లాన్ వేసుకుంటే, మరికొందరు ఈ ఎండల్లో బయటేం తిరుగుదాం ఇంట్లో హాయిగా కూర్చుని OTT ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు చూసేద్దాం అనుకుంటారు. మీరు కూడా ఇలాంటి వాళ్ళ లిస్ట్ లో ఉన్నారా ? వీకెండ్ ఒక కొత్త సినిమాను చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో భయంతో పాటు అడ్వెంచర్, నరాలు తెగే ఉత్కంఠ, ఊహించని మలుపులు ఉంటాయి. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ పేరేంటి ? కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2021లో విడుదలైన హాలీవుడ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రెడ్ స్కై’ (Blood Red Sky). ఈ చిత్రానికి పీటర్ థోర్వార్త్ దర్శకత్వం వహించగా, ఇందులో పెర్రీ బౌమీస్టర్, డొమినిక్ పర్సెల్, అలెగ్జాండర్ షియరర్, రోనాల్డ్ మోల్లర్, చిడి అజుఫో వంటి ప్రఖ్యాత నటీనటులు మెయిన్ లీడ్స్ లో నటించడం విశేషం. ఈ సినిమాకు IMDbలో 6.1 రేటింగ్ ఉండగా, మూవీ విడుదలైనప్పుడు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. అయితే ఓటీటీ మూవీ లవర్స్ కు మాత్రం ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. అయితే ఈ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది. ఈ వీకెండ్ ఓ మంచి థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ జర్మన్-బ్రిటిష్ యాక్షన్ హారర్ థ్రిల్లర్ ను విమానం హైజాక్ – వాంపైర్ కాన్సెప్ట్‌ను కలిపి తీశారు. నాడ్జా అనే మహిళ ఇందులో మెయిన్. ఆమె తన కొడుకు ఎలియాస్‌తో కలిసి జర్మనీ నుండి న్యూయార్క్‌కు విమానంలో జర్నీ చేస్తుంది. కానీ నాడ్జాకు ఒక వింత వ్యాధి ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ కోసమే ఈ ప్రయాణం. కానీ విమానం అలా గాల్లోకి ఎగరగానే, ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. ప్రయాణికులను భయపెట్టే క్రమంలో నాడ్జాపై కాల్పులు జరుపుతారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలుతుంది. ఇంకేముంది ప్రయాణికులు అందరూ ఆమె చనిపోయిందని భయపడతారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ తో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

Also Read : అంతరిక్ష నౌకలో అనుకోని అతిథి అరాచకం… మనుషుల్ని తినే మాయా జీవుల రచ్చ

Advertisement

నిజానికి నాడ్జా చనిపోదు. కారణం ఏంటంటే ఆమె ఒక వాంపైర్. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఆమెకు ఈ శాపం తగులుతుంది. అయితే తన కొడుకును కాపాడుకోవడానికి, తనలోని రాక్షసత్వాన్ని అదుపులో పెట్టుకుంటూ, అందుకోసం మందులు వాడుతూ బతుకుతుంది ఆమె. కానీ ఇప్పుడు హైజాకర్ల వల్ల తన కొడుకు ప్రాణాలకు ముప్పు వచ్చి పడుతుంది. దీంతో ఆమె తన నిజ రూపాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. విమానంలో చీకట్లోనే నాడ్జా ఒక్కొక్క హైజాకర్‌ ను వేటాడి వెంటాడి చంపుతుంది. అయితే హైజాకర్లలో ఒకడైన ఎయిట్‌బాల్ అనే సైకో ఊహించని పని చేస్తాడు. దీంతో అక్కడ అందరూ వాంపైర్ గా మారే పరిస్థితి వస్తుంది. మరి ఈ పరిస్థితిని హీరోయిన్ ఎలా అదుపులోకి తెచ్చింది ? తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది ? అన్నది స్టోరీ.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×