E-Paper
Advertisement

అంతరిక్షంలో అబ్బురపరిచే మిస్టరీ… ఓటిటిలో అదరగొడుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా

అంతరిక్షంలో అబ్బురపరిచే మిస్టరీ… ఓటిటిలో అదరగొడుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా
Advertisement

Science fiction adventure movie on OTT : రీసెంట్ గా ర్యాన్ గోస్లింగ్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక కిర్రాక్ స్పేస్ అడ్వెంచర్ సినిమా. సుమారు 200 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం రెండు నెలల్లోనే 650 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. భూమికి పెద్ద ఆపద వస్తే, అసలు ఏమీ గుర్తులేని ఒక మాస్టారు అంతరిక్షంలోకి వెళ్లి సైన్స్ ట్రిక్కులతో ఎలా గండం గట్టెక్కించాడనేది దీని అసలు కథ. ఈ సినిమాకి ఐయండిబిలో 8.3 రేటింగ్ కూడా ఉంది. ప్రేక్షకులకు ఈ సినిమా భలే మజా ఇస్తోంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఆండీ వీయర్ రాసిన ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (Project Hail Mary). ఇందులో ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటించారు. దీనికి ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఇందులో అంతరిక్షంలోని విజువల్స్‌ను అత్యంత సహజంగా చూపించడానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ఈ సినిమా 2026 మార్చిలో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విమర్శకులు సైతం ఈ సినిమాను అభినందించారు. ఈ సినిమా మే 12 నుండి Amazon Prime Video, Apple tv ప్లాట్‌ఫామ్స్ లో అద్దెకు అందుబాటులోకి వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

రైలాండ్ గ్రేస్ అనే స్కూల్ టీచర్ ఒక అంతరిక్ష నౌకలో ఒంటరిగా నిద్రలేస్తాడు. మొదట్లో అతనికి తన పేరు కూడా గుర్తుండదు. తరువాత మెల్లగా జ్ఞాపకాలు గుర్తొస్తాయి. సూర్యుడి శక్తిని తినేసే ‘ఆస్ట్రోఫేజ్’ అనే సూక్ష్మజీవుల వల్ల భూమి గడ్డకట్టే ప్రమాదంలో ఉందని, ఆ సమస్యకు పరిష్కారం కనుగొని మానవజాతిని రక్షించే చివరి ప్రయత్నంలో భాగంగానే తను అంతరిక్షంలోకి వచ్చానని తెలుసుకుంటాడు. తనతో వచ్చిన మిగతా ఇద్దరు సైంటిస్టులు చనిపోవడంతో, మొత్తం భూమి భవిష్యత్తు ఇప్పుడు గ్రేస్ చేతుల్లోనే ఉంటుంది.

ఈ సమయంలో గ్రేస్‌కు అంతరిక్షంలో మరో గ్రహానికి చెందిన వింత నౌక కనిపిస్తుంది. అందులో ఐదు కాళ్ల సాలీడులా ఉండే రాకీ అనే గ్రహాంతరవాసి ఉంటాడు. రాకీ గ్రహం కూడా అదే ఆస్ట్రోఫేజ్ సమస్య వల్ల నాశనమైపోయే స్థితిలో ఉంటుంది. గ్రేస్, రాకీ ఇద్దరూ ఒకరి భాష ఒకరు నేర్చుకుని, సైన్స్ సాయంతో స్నేహితులుగా మారతారు. తమ రెండు ప్రపంచాలను కాపాడటం కోసం ఇద్దరూ కలిసి రాత్రింబవళ్లు కష్టపడి ప్రయోగాలు చేసి, చివరికి ఆ సూక్ష్మజీవులను అరికట్టే విరుగుడును కనిపెడతారు.

Advertisement

అయితే చివరి నిమిషంలో ఒక ఊహించని సమస్య వస్తుంది. గ్రేస్ దగ్గర ఉన్న ఇంధనం భూమికి తిరిగి వెళ్లడానికి మాత్రమే సరిపోతుంది. కానీ తన స్నేహితుడు రాకీ నౌకలో ప్రమాదం జరిగిందని తెలుసుకున్న గ్రేస్, తన ప్రాణాలను పణంగా పెట్టి భూమికి తిరిగి వెళ్లే అవకాశాన్ని వదులుకుంటాడు. రాకీని కాపాడటానికి అతని గ్రహానికి వెళ్తాడు. భూమికి కావాల్సిన సమాచారాన్ని మాత్రం ఒక చిన్న రోబో ద్వారా పంపిస్తాడు. చివరికి గ్రేస్ ఒక హీరోగా నిలిచి, అటు భూమిని, ఇటు తన స్నేహితుడి గ్రహాన్ని రెండింటినీ కాపాడుతాడు.

Read Also : ప్రతి క్షణం మిమ్మల్ని భయపెట్టే హాలీవుడ్ హారర్ మూవీస్… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×