E-Paper
Advertisement

ఇలాంటి యాక్షన్ సినిమాలే దుమ్ము లేపేది… ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది

ఇలాంటి యాక్షన్ సినిమాలే దుమ్ము లేపేది… ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది
Advertisement

Best Netflix Action Movies : మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూడాలంటే గుర్తుకు వచ్చేది నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ. అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో ఉండే బెస్ట్ ఐదు యాక్షన్ సినిమాల గురించి చెప్పుకుందాం. మాస్, క్లాస్ యాక్షన్ ఇష్టపడే వారికి ఈ ఐదు సినిమాలు ఒక విందు లాంటివి. కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా, అదిరిపోయే కార్ ఛేజింగ్‌లు, గన్‌ ఫైట్స్, ఎమోషన్స్‌తో ఈ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆ ఐదు సినిమాల విశేషాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. లాస్ట్ బుల్లెట్ (Lost Bullet – 2020)

ఇది ఒక ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్. కార్ రేసింగ్, మెకానిక్ పనుల్లో ఆరితేరిన ఒక వ్యక్తి, తను చేయని నేరానికి ఎలా ఇరుక్కున్నాడు? తన నిజాయితీని నిరూపించుకోవడానికి అతను ఎలాంటి పోరాటం చేశాడు ? అనేదే ఈ సినిమా. ఇందులో కార్ ఛేజింగ్ సీన్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో సాగే ఈ సినిమా యాక్షన్ ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతుంది.

2. ది నైట్ కమ్స్ ఫర్ అస్ (The Night Comes for Us – 2018)

Advertisement

మీరు వయొలెంట్ యాక్షన్ సినిమాలను ఇష్టపడితే, ఇది మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇండోనేషియాకు చెందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. ఒక గ్యాంగ్‌స్టర్ ఒక చిన్న పాపను కాపాడటం కోసం తన సొంత గ్యాంగ్‌తోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు ఈ సినిమా ప్రత్యేకత. బలహీన గుండె ఉంటే, ఈ సినిమాకు దూరంగా ఉండటమే మంచిది.

3. వీల్‌మ్యాన్ (Wheelman – 2017)

ఈ సినిమా అంతా ఒక కారు చుట్టూనే తిరుగుతుంది. ఒక బ్యాంకు రాబరీలో డ్రైవర్‌గా ఉన్న హీరో, అనుకోకుండా ఒక పెద్ద కుట్రలో ఇరుక్కుంటాడు. సినిమా మొత్తం దాదాపు కారు లోపలే చిత్రీకరించినప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది.

4. కేట్ (Kate – 2021)

Advertisement

ఒక ప్రొఫెషనల్ కిల్లర్ (హీరోయిన్) కు ఎవరో విషం ఇస్తారు. ఆమె చనిపోవడానికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ లోపు తనను చంపాలనుకున్న వారిని ఆమె ఎలా వేటాడిందనేదే ఈ సినిమా కథ. టోక్యో నగర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్టైలిష్ యాక్షన్ సీన్స్, గన్ ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాల్లో ఇది టాప్ లిస్టులో ఉంటుంది.

5. ట్రిపుల్ ఫ్రాంటియర్ (Triple Frontier – 2019)

ఇది ఒక హీస్ట్ యాక్షన్ డ్రామా. ఐదుగురు మాజీ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్లు కలిసి ఒక డ్రగ్ లార్డ్ దగ్గర ఉన్న భారీ డబ్బును కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. అయితే ఆ డబ్బుతో తప్పించుకునే క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? వారి మధ్య వచ్చే విభేదాలు ఏంటి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బెన్ అఫ్లెక్ వంటి పెద్ద స్టార్స్ నటించిన ఈ సినిమా మామూలుగా అయితే ఉండదు. ఈ ఐదు సినిమాలు వేటికవే ప్రత్యేకం. వీకెండ్‌లో అదిరిపోయే యాక్షన్ థ్రిల్ పొందాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో వీటిని వెంటనే చూసేయండి.

Read Also : పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ తప్పిపోయిన సోదరి… యూట్యూబర్ తీసిన అద్భుతమైన హారర్ మిస్టరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×