E-Paper
Advertisement

ఇండియన్ హిస్టరీలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ… ఏముంది ఈ మూవీలో అంతగా ?

ఇండియన్ హిస్టరీలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ… ఏముంది ఈ మూవీలో అంతగా ?
Advertisement

Satluj OTT: సినిమాలకు, కాంట్రవర్సీలకు పెద్దగా దూరమేమీ కాదు. బంధువులం అన్నట్టుగా సినిమాలు ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు, వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ సినిమాలు ఉంటాయి. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ వివాదం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. మోస్ట్ కాంట్రావర్షియల్ మూవీగా పేరు తెచ్చుకున్న ఆ సినిమా పేరే ‘సట్లజ్’. ఒక సినిమా. మూడు వేర్వేరు టైటిల్స్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ వివాదం, అనూహ్యమైన ఓటీటీ విడుదల. ఆ తర్వాత కేవలం 48 గంటల్లోనే భారతదేశం నుండి అదృశ్యమైన దిల్జిత్ దోసాంజ్ ‘సట్లజ్’ (Satluj) గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. మరి ఈ మూవీ వివాదం ఏంటి ? అసలు ఎందుకింత వివాదం జరుగుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

‘సట్లజ్’ వివాదం ఇదే  

ఇటీవలి సంవత్సరాలలో భారతీయ సినిమా ప్రపంచంలోనే అత్యంత చర్చనీయాంశమైన మూవీ ‘సట్లజ్’. మొదట ‘ఘల్లుఘరా’గా ప్రకటించగా, తర్వాత ‘పంజాబ్ ’95’గా పేరు మార్చుకున్న ఈ చిత్రం చివరికి ‘సట్లజ్’ అనే మూడవ టైటిల్‌తో ఓటీటీలోకి వచ్చింది. హనీ ట్రెహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోపిక్ పొలిటికల్ డ్రామా 1990లలో పంజాబ్‌లో జరిగిన తీవ్రవాద యుగం నేపథ్యంలో సాగుతుంది. దిల్జిత్ దోసాంజ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ కాలంలో వేలాది గుర్తుతెలియని మృతదేహాలను అక్రమంగా దహనం చేశారనే ఆరోపణలను, వాటిపై దర్యాప్తు చేసిన ఖల్రా పాత్రతో ఈ చిత్రం ద్వారా భారతదేశ చరిత్రలోని అత్యంత సున్నితమైన అధ్యాయాలను తెరకెక్కించారు.

అసలు వివాదం ఏంటి ?

Advertisement

2022లో ఈ చిత్రం సెన్సార్ కోసం వెళ్తే, CBFC నుంచి సాధారణ క్లియరెన్స్ లభించకపోగా, 120కి పైగా కట్‌లు, టైటిల్ మార్పులు, సన్నివేశాల తొలగింపు వంటి అభ్యంతరాలు వచ్చాయి. నిర్మాతలు ఇన్ని మార్పులు చేస్తే చిత్రం అసలు ఉద్దేశం మారిపోతుందని వాదించారు. దీంతో చట్టపరమైన పోరాటం మొదలై, విడుదల దాదాపు నాలుగేళ్లు ఆలస్యమైంది. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అవుతుందని భావించినప్పటికీ, వివాదం కారణంగా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఇక ఎట్టకేలకు థియేటర్లలో మూవీ రిలీజ్ అయ్యేలా లేదని భావించి, డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

సైలెంట్ గా ఓటీటీలోకి

2026 జూలై 3న ‘సట్లజ్’ అనే కొత్త పేరుతో ZEE5లో నిశ్శబ్దంగా విడుదలైంది ఈ చిత్రం. దిల్జిత్ దోసాంజ్ ఈ చిత్రం అన్ కట్ ఒరిజినల్ వెర్షన్ అని ప్రకటించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత, ఎంతో చర్చకు దారితీసిన ఈ చిత్రాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు ఎట్టకేలకు లభించింది. కానీ ఆ సంబరానికి 48 గంటల్లోనే అడ్డుకట్ట పడింది. విడుదలైన రెండు రోజుల్లోనే భారతదేశంలోని ZEE5 నుండి చిత్రం అదృశ్యమైంది.

Advertisement

ZEE5 “ప్రస్తుత పరిణామాలు” కారణంగా తదుపరి ప్రకటన వరకు సినిమాను అందుబాటులో ఉంచలేమని ప్రకటించింది. ఈ తాజా పరిణామం వెనుక ఉన్న కచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు.ఈ చిత్రం అమెరికా, యూకే, కెనడా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ZEE5 గ్లోబల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: బుద్ధుడి స్టాచ్యూ ఇచ్చే శాపం… కన్ను కొడితే ఖతం… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×