E-Paper
Advertisement

Sarkaar Season 6 Promo: అబ్బబ్బ.. ఏం పెట్టల్ని పట్టుకొచ్చార్రా! ఈసారి ర్యాంపేజ్ ఫిక్స్!

Sarkaar Season 6 Promo: అబ్బబ్బ.. ఏం పెట్టల్ని పట్టుకొచ్చార్రా! ఈసారి ర్యాంపేజ్ ఫిక్స్!
Advertisement

Sarkaar Season 6 Promo: వెండితెరపై ఏమోగానీ, బుల్లితెరపై మాత్రం తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకెళుతున్నాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). డ్యాన్స్ షో అయినా, గేమ్ షో అయినా, సింగింగ్ షో అయినా హోస్ట్‌గా సుడిగాలి సుధీర్ ఉంటే, కిక్కే కిక్కు అన్నట్లుగా మార్చేస్తున్నాడు. మధ్యమధ్యలో ఆయన వేసే పంచ్‌లు, అలాగే వేయించుకునే పంచ్‌లతో ఆ షోకు నిండుతనం వస్తుంది. అందుకే సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న షో‌లకు రేటింగ్స్ బాగా వస్తుండటంతో ఆ టీవీ, ఈ టీవీ అని లేకుండా సుధీర్ కోసం షోలు రెడీ చేస్తున్నారు. ఇక ఓటీటీలో కూడా అది కంటిన్యూ అవుతోంది. విషయంలోకి వస్తే.. తన సబ్ స్క్రైబర్స్ కు ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ అందించేందుకు ఆహా ఓటీటీ చేస్తున్న ప్రయత్నాలు తెలియనివి కావు. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ మరింత పెంచుతూ సూపర్ హిట్ గేమ్ షో ‘సర్కార్ సీజన్ 6’ (Sarkaar Season 6)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ఆహా (Aha OTT).

Also Read- The Paradise: ఊర మాస్ స్టెప్స్‌తో షేర్ ఆగయా.. సాంగ్ ఎలా ఉందంటే?

అదిరిపోయే పెట్టల్ని పట్టుకొచ్చారు

Advertisement

ఈ నెల 27వ తేదీ నుంచి సర్కార్ సీజన్ 6 స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుపుతూ తాజాగా ఓ ప్రోమో వదిలారు. ఈ ప్రోమోతోనే ఈ సీజన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా తన టాలెంట్ చూపిస్తుండగా.. ఈసారి ఈ సీజన్‌కు అదిరిపోయే పెట్టల్ని పట్టుకొచ్చినట్లుగా ఈ ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు. ఆహాలో వచ్చిన ‘3 రోజెస్’ సీజన్ 2లోని భామలతో పాటు, బుల్లితెరపై సందడి చేసే సెలబ్రిటీలెందరో ఈసారి ఈ సీజన్‌లో భాగం కాబోతున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోని గమనిస్తే.. పాయల్ రాజ్ పుత్, రాశీ సింగ్, హెబ్బా పటేల్, గెహనా సిప్పీలతో హోస్ట్ సుధీర్ చేసిన ఫన్.. మాములుగా లేదు. ఇంకా వీరే కాకుండా అఖిల్ సార్థక్, మోనల్ గజ్జర్, విష్ణు ప్రియ, పృథ్వీ వంటి వారు కూడా ఈ గేమ్‌లో భాగమైనట్లుగా ఈ ప్రోమోలో తెలియజేశారు.

Also Read- S.S.Thaman: ఇద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి.. రోషన్ శ్రీదేవి పై తమన్ కామెంట్స్!

ప్రక్రియ మొదలెడదామా..

Advertisement

ఎప్పటిలానే సుధీర్‌పై కామెడీ, పంచ్‌లు బాగా పేలాయి. ముఖ్యంగా ముద్దుగుమ్మలందరూ సుధీర్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. హీరోయిన్లు కూడా ఎక్కడా తగ్గడం లేదు. కన్నెపెట్టరో.. కన్నుకొట్టరో అంటూ మొదలైన ఈ ప్రోమోలో.. వచ్చే ప్రతి సెలబ్రిటీని ప్రశంసలతో ముంచెత్తాడు సుధీర్. వాళ్లు కూడా సుధీర్‌‌ని వదలకుండా పంచ్ వెనుక పంచ్ ఇస్తూనే ఉన్నారు. ‘కరోనా కన్నా డేంజర్‌గా ఉన్నాడు’, ‘ప్రక్రియ మొదలెడదామా’, ‘అబ్బ.. అబ్బబ్బ’.. ఇలాంటి సౌండింగ్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 7 గంటలకు సర్కార్ సీజన్ 6 స్ట్రీమింగ్ కాబోతోంది. చూద్దాం మరి.. ఈ అందమైన కంటెస్టెంట్స్, హోస్ట్ సుధీర్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ఫన్నీ సమాధానాలు ఇస్తారో.. ఎలా నవ్విస్తారో?

Also Read- Up Coming Movies : ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోకి రానున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఇవే… అక్యూస్డ్ నుండి ది కేరళ స్టోరీ 2 వరకు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×