E-Paper
Advertisement

Mokshagna Teja: ఆదిత్య 999తోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే!

Mokshagna Teja: ఆదిత్య 999తోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే!
Advertisement

Mokshagna Teja: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇప్పటికే నందమూరి నట వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ ఉన్నారు తప్ప ఇప్పటివరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై సరైన స్పష్టత మాత్రం రాలేదు . గతంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు .కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ అయోమయంలో పడింది.

ఆదిత్య 999 మ్యాక్స్ తో ఎంట్రీ..

ఇక బాలకృష్ణ (Balakrishna)ఎక్కడికి వెళ్లినా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందంటూ చెబుతున్నారు తప్ప క్లారిటీ మాత్రమే ఇవ్వలేదు అయితే తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉండబోతుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఆదిత్య 999 మ్యాక్స్(Aditya 999 max) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ తెలుగు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా అని చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన సినిమాకు సీక్వెల్ సినిమాతో మోక్షజ్ఞ ఇంటర్వ్యూ ఉండబోతుందని తెలుస్తోంది.

క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ…

Advertisement

ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. ఇలా ఈయన డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇలాంటి చారిత్రాత్మక సినిమాలను తెరకెక్కించడంలో క్రిష్ జాగర్లమూడి దిట్ట అని చెప్పాలి. ఇలాంటి టాలెంటెడ్ దర్శకుడు చేతుల మీదుగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయడం సరైన నిర్ణయం అని బాలకృష్ణ భావించినట్టు తెలుస్తోంది.

హై-క్వాలిటీ విజువల్స్..

Advertisement

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా హై-క్వాలిటీ విజువల్స్, డీప్ ఎమోషన్స్, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా అధికారక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది.

Also Read: S.S.Thaman: ఇద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి.. రోషన్ శ్రీదేవి పై తమన్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×