E-Paper
Advertisement

Romantic Series OTT : శేటు బిడ్డతో యవ్వారం… చిన్న పిల్లలు చూడకూడని సిరీస్… కుర్రాళ్లకు మాత్రం కిక్కు పక్కా

Romantic Series OTT : శేటు బిడ్డతో యవ్వారం… చిన్న పిల్లలు చూడకూడని సిరీస్… కుర్రాళ్లకు మాత్రం కిక్కు పక్కా
Advertisement

Romantic Series OTT : అచ్చమైన పల్లెటూరి కథలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే సినిమాలు అందరికీ నచ్చుతాయి. కానీ ఓటీటీలో అలాంటి సినిమాలు చాలా అరుదు. ఎప్పుడైనా ఇలాంటి సినిమాలను చూడాల్సి వస్తే సముద్రంలో ఇసుక రేణువును వెతికినట్టుగా వెతకాల్సి వస్తుంది. అలా వెతికే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? సినిమా కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఆహాలో అందుబాటులో

లాక్ డౌన్ సమయంలో ఓటీటీలలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా మంచి ఆదరణ పెరిగింది. అలాంటి సమయంలోనే వచ్చిన వెబ్ సిరీస్ తెలుగు వెబ్ సిరీస్ ‘కొత్త పోరడు’ (Kotha Poradu). ఈ వెబ్ సిరీస్ కు అన్వేష్ మైఖేల్ దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. అన్వేష్ మైఖేల్ రాసి, దర్శకత్వం వహించడం మాత్రమే కాదు… మెయిన్ రోల్‌ కూడా పోషించారు. 2020 జనవరి 26న ahaలో ప్రీమియర్ అయింది. మొత్తం మొదటి సీజన్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 15-25 నిమిషాలు ఉంటుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

పక్కా పల్లెటూరు లోకల్ కుర్రాడు రాజు (అన్వేష్ మైఖేల్). దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరుగుతాడు. రాజు తండ్రి పేరు ఇస్తారయ్యా (సుధాకర్ రెడ్డి). అతను స్వంత ఊళ్లోనే లెక్కకు మించిన భార్యలతో స్థాయికి మించి అప్పులు చేస్తాడు. ఇలాంటి పనులతో రాజు కుంటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇస్తారయ్యా తాగుడు, తిరుగుడుతో ఫ్యామిలీ కష్టాల్లో కూరుకుపోతుంది. మరోవైపు రాజు చిన్ననాటి ప్రియురాలు నగ్మాను ఇష్ట పడతాడు. కానీ ఆ విషయం తెలుసుకున్న నగ్మా తండ్రి శేటు తన కూతురిని వేరే అబ్బాయికి ఇచ్చి రాత్రికి రాత్రే పెళ్లి చేసేస్తారు. అసలే అప్పుల బాధలో ఉన్న రాజు రాజేష్ (రాజ్ తిరందాసు)తో వైరం, కుటుంబ సమస్యలతో మరింతగా ఇరుక్కుంటాడు. మరి వీటిని నుంచి రాజు ఎలా బయట పడ్డాడు ? అతని ప్రేమ కథ ఏమైంది ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే. అయితే చూసేటప్పుడు చిన్నపిల్లలు లేకుండా చూసుకుంటే బెటర్. ఎందుకంటే సిరీస్ లో ‘మీర్జాపూర్’ రేంజ్ తిట్లు, పెద్దలకు మాత్రమే అన్పించే సీన్లు చాలానే ఉంటాయి. కానీ సరదాగా ఓ మంచి సిరీస్ చూడాలనుకునే కుర్రాళ్లకు ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్.

Also Read : చచ్చిన ఏడేళ్ళ తరువాత వరల్డ్ పాలిటిక్స్ ను ఊపేసిన ఖేడీ కథ… అమెరికాను షేక్ చేసిన కామన్ మ్యాన్ క్రైమ్ లార్డ్ గా ఎలా ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×