E-Paper
Advertisement

Low-Budget South Films : తక్కువ బడ్జెట్ తోనే థియేటర్లు, ఓటీటీలు దద్దరిల్లేలా చేసిన సౌత్ బ్లాక్ బస్టర్స్… ఇందులో మీరెన్ని చూశారు ?

Low-Budget South Films : తక్కువ బడ్జెట్ తోనే థియేటర్లు, ఓటీటీలు దద్దరిల్లేలా చేసిన సౌత్ బ్లాక్ బస్టర్స్… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Low-Budget South Films : అన్ని భారీ బడ్జెట్ సినిమాలు సక్సెస్ కావు. అలాగే అన్ని విజయవంతమైన సినిమాలు తప్పనిసరిగా భారీ బడ్జెట్ తో నిర్మితం అయినవి కాదు. అందుకే మూవీ హిట్ అవ్వడానికి కట్ అవుట్ కాదు కంటెంట్ ముఖ్యం అంటూ ఉంటారు. ఇదే విషయాన్ని అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. అందులో చెప్పుకోదగ్గ సౌత్ సినిమాల లిస్ట్ పెద్దదే. మరి ఇలా తక్కువ బడ్జెట్ తో వచ్చి, బాక్స్ ఆఫీసు రికార్డులను బద్దలు కొట్టిన సినిమాలు ఏంటి? ఆ సినిమాలు ఇప్పుడు ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

1. కాంతార

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ‘కాంతార’ మూవీ గురించే. 2022లో విడుదలైన ఈ మూవీతోనే రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడ్, మానసి సుధీర్ తదితరులు నటించిన ఈ ,మూవీలో కర్ణాటక తీరప్రాంతంలో జరిగే పవిత్ర సంప్రదాయాలు, దురాశ, ప్రకృతి విలయ తాండవం వంటి అంశాలను మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. ఇందులో హీరో శివుడు తన గ్రామ భూమిని అవినీతిపరుడైన అటవీ అధికారి, భూస్వామి నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా 397 కోట్ల భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కడం విశేషం. ఈ మూవీని ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

2. కార్తీకేయ 2

Advertisement

అదే ఏడాది విడుదలైన ‘కార్తికేయ 2’ కూడా ఈ లిస్ట్ లో ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, ఆదిత్య మీనన్, సత్య, ప్రవీణ్, ఆదిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2014లో విడుదలైన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను వసూలు చేసి, సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ZEE5లో అందుబాటులో ఉంది.

3. లోకా చాప్టర్ 1: చంద్ర

2025లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అన్పించుకున్న ఫస్ట్ మలయాళం లేడి సూపర్ హీరో మూవీ ఇది. డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ, చందు సలీం కుమార్, అరుణ్ కురియన్, నిశాంత్ సాగర్ మెయిన్ లీడ్స్ గా నటించారు. దుల్కర్ సల్మాన్ తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు . రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసిన ఘనత సాధించి, ఈ రికార్డును నెలకొల్పిన మొదటి మూవీగా నిలిచింది. ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

4. హనుమాన్

Advertisement

2024లో విడుదలైన విజువల్ వండర్ ‘హనుమాన్’. బడ్జెట్ తో పని లేకుండా అద్భుతమైన క్వాలిటీతో సినిమా అంటే ఎలా ఉండాలో చూపించిన మూవీ ఇది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ఈ మూవీలో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ మెయిన్ రోల్స్ పోషించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి భాగం అని చెప్పుకునే హనుమాన్, అత్యధిక వసూళ్లు సాధించిన సూపర్ హీరో చిత్రాలలో ఒకటి. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ. 296 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జీ5 లో ఈ సినిమాను చూడవచ్చు. ఇంకా ఈ లిస్ట్ లో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, సు ఫ్రమ్ సో వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

Also Read : ‘మన శంకర వర ప్రసాద్’ నుంచి ‘అనగనగా ఒక రాజు’ వరకు… ఈ వీకెండ్ తెలుగు సినిమాల పండగ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×