E-Paper
Advertisement

పెళ్లికి ముందే పరాయి వాళ్ళతో… దిమాక్ ఖరాబ్ అయ్యే సీన్లు

పెళ్లికి ముందే పరాయి వాళ్ళతో… దిమాక్ ఖరాబ్ అయ్యే సీన్లు
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ అనే పదం వింటే కొంత మంది పులకరించిపోతారు. ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది కూడా. అలాంటి వాళ్లకోసమే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ. అయితే ఇందులో సీన్లు చాలా బోల్డ్‌గా, రొమాంటిక్‌గా ఉంటాయి. దీనికి తోడు ఈ సినిమా షూటింగ్ అంతా సముద్ర తీరాల్లో జరిగింది. సినిమా నిడివి కూడా 1 గంట 39 నిమిషాలు ఉంటుంది. అయితే చూపు తిప్పడం కష్టంగానే ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకునే ఒక జంట పక్కదార్లు పడటంతో కథ ఓ రేంజ్ లో సాగుతుంది. ఇది పెద్దల సినిమా, ఒంటరిగా చూడటం చాలా మంచిది.

ఎక్కడ చూడచ్చు అంటే

2022లో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ సినిమా పేరు ‘బ్రీత్ అగైన్’ (Breathe Again). రాఫీ ఫ్రాన్సిస్కో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరియెల్లా అరిడా (జోవన్నా), టోనీ లాబ్రుస్కా (రాబర్ట్), ఇవాన్ పాడిల్లా (పాలో) జేలా క్వెంకా (వివియన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన అరియెల్లా అరిడా, 2013 మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ విజేత కావడంతో ఆమె గ్లామర్ సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు రాఫీ ఫ్రాన్సిస్కో నీటి అడుగున తీసిన ఫ్రీ-డైవింగ్ సీన్లను చాలా క్రేజీగా చూపించారు. ఇది Vivamax అనే ఓటిటి ప్లాట్‌ఫామ్ కోసం తీసిన ఒరిజినల్ మూవీ కావడంతో, ఇందులో బోల్డ్ కంటెంట్ మోతాదు కొంచెం ఎక్కువే ఉంటుంది. అందుకే దీనికి R-18 (పెద్దలకు మాత్రమే) రేటింగ్ కూడా ఇచ్చారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జోవన్నా, పాలో అనే ఒక అందమైన జంట ఉంటారు. వీళ్ళిద్దరూ ఏడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యి, ఎంజాయ్ చేయడానికి ఒక బీచ్‌ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ పాలో తన గర్ల్‌ఫ్రెండ్ జోవన్నాకు ప్రపోజ్ కూడా చేస్తాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న టైమ్‌లో వాళ్ళ బంధంలో ఊహించని మలుపు మొదలవుతుంది. ఆ బీచ్‌కి వెళ్ళాక కథ అడ్డం తిరుగుతుంది. పాలో అక్కడ వివియన్ అనే ఒక హాట్ అమ్మాయిని చూసి కంట్రోల్ తప్పి ఆమె వెనక పడతాడు.

ఇంకోవైపు జోవన్నాకు డైవింగ్ నేర్చుకోవాలని ఆశ పుడుతుంది. అక్కడ ఆమెకు రాబర్ట్ అనే డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ పరిచయమవుతాడు. జోవన్నా నీళ్లలోకి వెళ్లినప్పుడు రాబర్ట్ ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం, ఆ సాన్నిహిత్యం వల్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పెరిగి జోవన్నా కూడా దారి తప్పుతుంది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ, కొత్త వ్యక్తులు పరిచయం కాగానే పాత ప్రేమను మర్చిపోయి హద్దులు దాటేస్తారు. ఈ సీక్రెట్ ఎఫైర్ల వల్ల వాళ్ళ ఏడేళ్ల ప్రేమ బంధం ముక్కలవుతుందా? లేక మళ్ళీ కలిసి బ్రీత్ అగైన్ అని ఊపిరి పీల్చుకుంటారా? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : తండ్రుల ఇగోలు కొడుకుల గోలలు కలిపి కొట్టిన పక్కా రౌడీ స్టోరీ… ఐయండిబిలో 8.4 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×