E-Paper
Advertisement

ప్రేమలో ఉండే మ్యాజిక్ అదేనబ్బా… దిల్ ఖుష్ చేసే కొరియన్ డ్రామా

ప్రేమలో ఉండే మ్యాజిక్ అదేనబ్బా… దిల్ ఖుష్ చేసే కొరియన్ డ్రామా
Advertisement

Romantic Drama OTT :కొరియన్ రొమాంటిక్ సిరీస్ లు మనసుకి హత్తుకునేలా ఉంటాయి. ప్రేమలో ఉండే చిన్న చిన్న మనస్పర్థలను, ఇగోలను చాలా రియలిస్టిక్ గా చూపించడం వీళ్ళకు ఉన్న ప్రత్యేకత. ఇక ఈ సిరీస్ లను కూడా తెగ చూస్తున్నారు ప్రేక్షకులు. వీటిని చూడటం కొంతమంది క్రేజీగా ఫీల్ అవుతున్నారు కూడా. అయితే అలాంటి క్రేజీ సిరీస్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆన్లైన్ లో పరిచయం అయిన ఒక జంట ప్రేమలో పడటంతో ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీ ఎపిసోడ్ కూడా చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటుంది. ప్రేమలో ఉండే మ్యాజిక్ ను ఈ సిరీస్ చాలా చక్కగా చూపిస్తుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ సిరీస్ పేరు ‘టెంపరేచర్ ఆఫ్ లవ్’ (Temperature of Love). ఈ సీరీస్‌లో హీరోగా నటించిన యాంగ్ సే-జోంగ్ తన నటనకు గాను 2017లో ‘బెస్ట్ న్యూ యాక్టర్’గా ఏకంగా మూడు ప్రధాన అవార్డులను గెలుచుకున్నాడు. హీరోయిన్ సియో హ్యున్-జిన్ అతని మధ్య ఉన్న కెమిస్ట్రీ అప్పట్లో కొరియాలో ఒక సెన్సేషన్. కేవలం నటన మాత్రమే కాకుండా, ఈ డ్రామాలో చూపించే వంటకాలు, ఆ రెస్టారెంట్ వాతావరణం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సీరీస్‌లోని “You Are”, “Rising Temperature” వంటి పాటలు మెలోడీ ప్రియులను అలరించాయి. మొత్తం 40 ఎపిసోడ్లు ఉన్న ఈ డ్రామా ప్రస్తుతం ‘వికీ’ (Viki) ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరోయిన్ హ్యున్-సూకి రైటర్ అవ్వాలని పిచ్చి కోరిక, అందు కోసం పగలు రాత్రి కష్టపడుతుంటుంది. అప్పుడే ఆన్‌లైన్ చాటింగ్‌లో ఆమెక్ హీరో జంగ్-సోన్ పరిచయమవుతాడు. అతను మామూలోడు కాదు, వంటల్లో కింగ్. వీళ్ళిద్దరూ బయట కలుసుకున్న మొదటి రోజే, కుర్రాడు స్పీడ్ పెంచి మనం డేటింగ్‌ చేద్దామా? అని అడిగేస్తాడు. అమ్మాయికి కూడా వాడు నచ్చినా, తన కెరీర్ ముఖ్యం అనుకుని కాస్త దూరం పెడుతుంది. సరిగ్గా అదే టైమ్‌లో హీరోకి ఫ్రాన్స్ వెళ్లే ఛాన్స్ వస్తుంది. వెళ్లే ముందు ఫోన్ చేసినా ఈమె ఎత్తదు, అలా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది.

కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత.. అమ్మాయి ఒక రైటర్‌గా సెటిల్ అవుతుంది, కుర్రాడు పెద్ద చెఫ్ అయి సొంతంగా హోటల్ పెడతాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ తారసపడతారు. పాత ప్రేమ ఇంకా లోపల ఉన్నా, బయటకి మాత్రం ఇగోలు అడ్డు వస్తుంటాయి. అప్పుడు ఎందుకు వెళ్ళిపోయావ్?, అప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అని ఒకరినొకరు క్వశ్చన్ చేసుకుంటూ, గొడవలు పడుతూనే మళ్ళీ దగ్గరవుతుంటారు. ఈ లోపు ఈమె రాసే సీరియల్స్ కోసం, అతని వంటల కోసం ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ హీరోయిన్‌ని ఇష్టపడతాడు. వాడు హీరోకి మంచి దోస్త్ కూడా. అటు పక్క ఫ్రెండ్, ఇటు పక్క లవ్.. మధ్యలో వీళ్ళిద్దరి గొడవలు. ఇన్ని తిప్పల మధ్య ఈ జంట ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈ సిరీస్ ముగింపు.

Advertisement

Read Also : పాతికేళ్లయినా దొరకని భర్త ఆచూకీ… నియంత పాలనలో నలిగిపోయిన జీవితం… గుండెల్ని పిండేసే రియల్ స్టోరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×