E-Paper
Advertisement

Romantic Drama OTT : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా

Romantic Drama OTT : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా
Advertisement

Romantic Drama OTT :  ఓటీటీలో మనసుకు హత్తుకునే ఒక మంచి రొమాంటిక్ మూవీ గురించి వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇలాంటి సినిమాలు మనకు ఇష్టమైన వారితో, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ తో కలిసి చూస్తే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ అలా చూడడానికి పర్ఫెక్ట్ ఆప్షన్. చూశాక మీరే వర్త్ వాచింగ్ మావా అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం… మూవీ డీటైల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

స్టేజ్ ఓటీటీలో అందుబాటులో

సాన్వరీ (Saanwari) 2025లో వచ్చిన హర్యాన్వీ రొమాంటిక్ డ్రామా మూవీ. పల్లవి రాయ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రాన్స్‌జెండర్ లవ్ స్టోరీ, సోషల్ ఇష్యూస్ చుట్టూ తిరుగుతుంది. సుమారు 2 గంటలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2025 సెప్టెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ అయింది. ఆడియెన్స్ డిమాండ్ వల్ల 3 రోజులు ముందుగానే మూవీని రిలీజ్ చేశారు. ఇప్పుడు స్టేజ్ (Stage) OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. హర్యాన్వీ ఒరిజినల్‌ ఆడియోలో, సబ్‌టైటిల్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. భాష అడ్డు కాదనుకుంటే హ్యాపీగా ఈ మూవీని చూడవచ్చు.

Advertisement

ఇందులో మెయిన్ లీడ్‌ రోల్ లో ప్రమోద్ దేశ్వాల్, కనక్ గార్గ్ నటించారు. భాన్వర్ అనే గ్రామస్తుడుగా ప్రమోద్, సాన్వరీ అనే ట్రాన్స్‌జెండర్ బ్రైడ్ పాత్రలో కనక్ కన్పించారు. సర్థక్ నారులా, పల్లవి రాయ్ ఇతర రోల్స్‌లో సపోర్టింగ్‌ యాక్టర్స్ గా నటించారు. ప్రమోద్ దేశ్వాల్ సింపుల్ విలేజర్ రోల్‌ లో బాగా ఫిట్ అయ్యాడు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనక్ గార్గ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ హైలైట్.

Read Also : హీరోయిన్ పై పొలిటికల్ లీడర్ మోజు… హై వోల్టేజ్ షాకిచ్చే క్లైమాక్స్… జన్మలో అమ్మాయిల జోలికి వెళ్లరు

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కథ హర్యాన్వీ గ్రామంలో జరుగుతుంది. భాన్వర్ (ప్రమోద్ దేశ్వాల్) పేదరికం వల్ల పెళ్లి చేసుకోలేకపోతాడు. కానీ తన దగ్గరున్న కొంచం డబ్బుతో ఒక పెళ్లి కూతురుని కొంటాడు. ఆ అమ్మాయి పేరు సాన్వరీ (కనక్ గార్గ్). కానీ తీరా కొన్నాక అతనికి ఊహించని షాక్ తగులుతుంది. సాన్వరీ అసలు అమ్మాయే కాదు ట్రాన్స్‌జెండర్ అని తెలిసి అతనికి ఫ్యూజులు అవుట్ అవుతాయి. మొదట ఇద్దరి మధ్య బంధం ట్రాన్సాక్షనల్ రిలేషన్‌గా స్టార్ట్ అయినా, క్రమంగా నిజమైన ప్రేమగా మారుతుంది.

కానీ భాన్వర్ ఫ్యామిలీ (లాల్చి కాకోసా), సమాజం తిరస్కారం వాళ్ల రిలేషన్‌ కి అడ్డంకిగా మారుతుంది. ప్రేమకి సరిహద్దులు లేవని చూపించే ఎమోషనల్ జర్నీ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. మరి ఇంతకీ హీరో హీరోయిన్ ఒక్కటయ్యారా? అసలు వాళ్ళకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా దాటారు? అన్నది స్టోరీ. ఇదొక బోల్డ్, ఎమోషనల్ లవ్ స్టోరీ. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ మూవీ రొమాంటిక్ డ్రామా, సోషల్ ఇష్యూస్ ఇష్టపడేవాళ్లకి మస్ట్ వాచ్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×