// // Revenge Drama OTT: మామూలోళ్లు కాదు ఈ ఆడోళ్ళు... -->
E-Paper
Advertisement

Revenge Drama OTT: మామూలోళ్లు కాదు ఈ ఆడోళ్ళు… ప్రేమిస్తూనే అలాంటి పనా… క్రేజీ కథ మావా

Revenge Drama OTT: మామూలోళ్లు కాదు ఈ ఆడోళ్ళు… ప్రేమిస్తూనే అలాంటి పనా… క్రేజీ కథ మావా
Advertisement

Revenge Drama OTT : కొరియన్ సిరీస్ లకు డిమాండ్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది. అందుకు తగ్గట్టే దర్శకులు కూడా వీటిని సరికొత్తగా చూపించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మామూలుగా వెబ్ సిరీస్ లు 10,15 ఎపిసోడ్లతో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే వెబ్ సిరి మాత్రం ఈ ఏకంగా 120 ఎపిసోడ్ లు ఉంటుంది. ఈ సిరీస్ రివేంజ్ డ్రామాలా ఆసక్తికరంగా సాగుతుంది. తమ తండ్రి చావుకి కారకులైన వారిపై రివెంజ్ తీర్చుకునే ఇద్దరు అక్కచెల్లెళ్ల చుట్టూ ఈ స్టోరీ ఉంటుంది. ఇక రోజుకు ఒక్క ఎపిసోడ్ చొప్పున చూసినా, ఈ సిరీస్ చూడ్డానికి నాలుగు నెలల సమయం అయితే పడుతుంది. మరి అంతా ఓపిగ్గా ఫ్యాన్స్ చూడగలిగితే విశేషమే.

ఎక్కడ చూడచ్చు అంటే

రివేంజ్ నేపథ్యంతో సాగే ఈ సరికొత్త కొరియన్ సిరీస్ పేరు ‘ఫస్ట్ మ్యాన్’ (The First Man). హామ్ యున్-జుంగ్, ఓ హ్యూన్-క్యుంగ్, యూన్ సున్-వూ వంటి ప్రముఖ నటులు ఇందులో నటించారు. ఇది దాదాపు 121 ఎపిసోడ్ల పాటు సాగే డైలీ డ్రామా. ఇది 2025 డిసెంబర్ 15 నుంచి, కొరియాలో MBC ఛానల్‌లో ప్రసారమవుతుండగా, Apple TVలో కూడా అందుబాటులో ఉంటోంది. చిన్నప్పుడే విడిపోయిన కవల అమ్మాయిల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చైల్డ్ హుడ్‌లోనే విడిపోయిన ఇద్దరు కవల అక్కాచెల్లెళ్ల కథ ఇది. ఒకరేమో కష్టపడి వంటలు నేర్చుకుంటూ బుద్దిగా పెరుగుతుంది. ఇంకొకతేమో, ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీలో గారాబంగా పెరుగుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణం ఒక స్వార్థపరురాలైన మాహిళ. ఆమె తన ఎదుగుదల కోసం వీళ్ల తల్లి జీవితాన్ని నాశనం చేసి, ఈ పిల్లలను దూరం చేస్తుంది. పెద్దయ్యాక ఈ ఇద్దరు సిస్టర్స్ ఒకరినొకరు కలుసుకుంటారు. తమ ఫ్యామిలీని రోడ్డున పడేసిన ఆ విలన్ గురించి వీళ్లకు నిజం తెలుస్తుంది. దాంతో ఇద్దరూ కలిసి ఒక అదిరిపోయే ప్లాన్ వేస్తారు.

ఇద్దరూ తమ ఐడెంటిటీని మార్చుకుని (అంటే ఒకరి ప్లేస్‌లోకి ఇంకొకరు వెళ్లి), ఆ విలన్ ఇంటికే కోడళ్లుగా అడుగుపెడతారు. తనను నమ్మించి బురిడీ కొట్టించి, ఆమె చేసిన పాపాలన్నింటినీ బయటపెట్టి బుద్ది చెప్పడమే వీళ్ల మెయిన్ టార్గెట్. ఈ క్రమంలో వీళ్లకు ఇద్దరు కుర్రాళ్లు చయం అవుతారు. వాళ్లతో లవ్ స్టోరీ నడుస్తూనే, మరోపక్క విలన్ వేసే కుట్రలను వీళ్లు ఎలా తిప్పికొట్టారు ? వీళ్ళు రివేంజ్ ఎలా తీర్చుకుంటారు ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : రక్తం రుచి మరిగిన సముద్రపు దొంగలు… ఓటీటీలో దుమ్ములేపుతున్న సిరీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×