E-Paper
Advertisement

Horror movie OTT: మాటలు రాని మంత్రగత్తె … మైండ్ బ్లాక్ చేసే మాయలు… జడుసుకునే సీన్స్ కూడా

Horror movie OTT: మాటలు రాని మంత్రగత్తె … మైండ్ బ్లాక్ చేసే మాయలు… జడుసుకునే సీన్స్ కూడా
Advertisement

Horror movie OTT : మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ , ఈ జోనర్ సినిమాలో చూసేటప్పుడు ఆడియన్స్ కి మాత్రం చెమటలు పడుతుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇదే జానర్ లో ఉంటుంది. అయితే ఇది మామూలు హారర్ సినిమా లాగా కాకుండా, మనిషి జీవితంలో ఎమోషన్స్ కూడా చాలా లోతుగా చూపిస్తుంది. అందుకే విమర్శకుల నుంచి దీనికి మంచి ప్రశంసలు దక్కాయి కూడా. ఈ కథ 19వ శతాబ్దపు మాసిడోనియాలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఒక చిన్న మూగ అమ్మాయిని ఒక మంత్రగత్తె కిడ్నాప్ చేసి, ఆమెను కూడా తనలాగే మంత్రగత్తెగా మారుస్తుంది. ఆ తరువాత అసలు కథ ఉంటుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ మాసిడోనియా హారర్ మూవీ పేరు ‘You Won’t Be Alone’. గోరన్ స్టోలెవ్స్కీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నూమి రాపాస్, అనమారియా మారింకా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం 2022న ఏప్రిల్ 1న యునైటెడ్ స్టేట్స్‌ థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో (prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పూర్వకాలంలో మాసిడోనియా అనే ఒక పల్లెటూరిలో ఒక ముసలి మంత్రగత్తె ఉండేది. ఆమె ఒక పసిపిల్లను ఎత్తుకెళ్లి, తనలాగే మంత్రగత్తెగా మార్చేసి ఒక గుహలో బంధిస్తుంది. ఆ అమ్మాయికి మాటలు రావు, లోకం అంటే ఏమిటో తెలియదు కూడా. 16 ఏళ్ల తర్వాత ఆ గుహ నుండి బయటపడిన ఆ అమ్మాయికి, ఈ మనుషుల లోకం కొత్తగా కనిపిస్తుంది. కానీ ఆమెకు ఒక వింత శక్తి ఉంటుంది. ఆమె ఎవరినైనా చంపి, వాళ్ల శరీరంలోకి దూరి, వాళ్లలాగే మారిపోగలదు. అలా ఆ అమ్మాయి మొదట ఒక ఆడదానిలా, తర్వాత ఒక మొగుడిలా, ఆ పైన ఒక చిన్న పిల్లోడిలా… ఇలా రకరకాల వేషాలు వేసి ఊరిలో తిరుగుతూ ఉంటుంది. మనుషులు ఎలా తింటారు? ఎలా ప్రేమిస్తారు? ఆఖరికి చావు అంటే ఏంటి? అని ప్రతి విషయాన్ని దగ్గరుండి చూస్తుంది.

బయటికి మంత్రగత్తెలా కనిపించినా, లోపల మాత్రం మనిషి జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆరాటం ఆమెలో కనిపిస్తుంది. కానీ ఆ ముసలి మంత్రగత్తె మాత్రం ఈమెను వదిలిపెట్టదు. మనుషులు చాలా దుర్మార్గులు, వాళ్లతో నీకు స్నేహం వద్దని ఆమెను వేధిస్తూనే ఉంటుంది. అయినా సరే, ఆ అమ్మాయి మనుషుల మధ్యే ఉంటూ వాళ్ల కష్టసుఖాలను అనుభవిస్తుంది. చివరికి ఆ ముసలి మంత్రగత్తె వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? వాటిని ఆ అమ్మాయి ఎలా ఎదుర్కుంటుటుంది ? ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏమైంది ? అనేదే ఈ సినిమా ముగింపు.

Advertisement

Read Also : అప్పులు చేసి కొన్న కొంపతో తిప్పలు… కిడ్నాప్ తో చిక్కులు… స్ట్రీమింగ్ కి మరో కే డ్రామా రెడీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×