E-Paper
Advertisement

ఆకాశం నుంచి ఊడిపడే డబ్బుల కట్టలు… క్రేజీ క్లైమాక్స్

ఆకాశం నుంచి ఊడిపడే డబ్బుల కట్టలు… క్రేజీ క్లైమాక్స్
Advertisement

Best Short Film OTT : ఇటీవలే సినిమాలే కాదు సిరీస్ లకు కూడా ఓటీటీలో ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే షార్ట్ ఫిల్మ్స్ కూడా అవార్డు విన్నింగ్ కంటెంట్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మనం కేవలం మూడు నిమిషాల నిడివి ఉన్న మూవీ గురించి తెలుసుకుందాం. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? అనేది వివరంగా తెలుసుకుందాం పదండి.

ఓటీటీలో ఫ్రీగానే స్ట్రీమింగ్

విలక్షణమైన, సూపర్ హిట్ తమిళ షార్ట్ ఫిల్మ్ Rendu (రెండు). పవన్ అలెక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విమర్శకులకు సైతం ఆకట్టుకుంది. పాపులర్ ‘మూవీబఫ్ బిగ్ షార్ట్స్ కాంటెస్ట్’ (Moviebuff Big Shorts Contest) లో టాప్ 5 లో నిలిచింది. తమిళనాడు వ్యాప్తంగా వందలాది థియేటర్లలో ప్రీమియర్ కాగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ ను ఫ్రీగానే చూడవచ్చు. ప్రస్తుతం YouTube లో వీక్షించడానికి ఈ మూవీ అందుబాటులో ఉంది. తక్కువ నిడివిలోనే ఒక హాలీవుడ్ స్టైల్ క్రైమ్-సస్పెన్స్ థ్రిల్లర్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

Advertisement

ఈ చిన్న చిత్రాన్ని ఒక ఫీచర్ ఫిల్మ్ రేంజ్‌లో పవన్ అలెక్స్ తన వినూత్న మేకింగ్ స్టైల్‌తో తెరకెక్కించి ఆకట్టుకున్నారు. థేజో భరద్వాజ్ సినిమాటోగ్రఫీ, వికీ పప్ ఎడిటింగ్ ఈ షార్ట్ ఫిల్మ్ లోని ఇంటెన్సిటీని పెంచాయి. ముఖ్యంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ షార్ట్ ఫిల్మ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. అందులో నటించిన నటీనటులు కూడా జీవించారు.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా స్టోరీ అంతా ఒక లగ్జరీ కార్ బ్యాక్ సీట్‌ లో ఉండే రెండు చెక్క పెట్టెల చుట్టూనే సాగుతుంది. ఆ పెట్టెలలో అత్యంత విలువైన వస్తువులు ఉంటాయి. ఒక వైపు ఆ పెట్టెలను వేరొకరికి డెలివరీ చేయాలని చూసే కొంతమంది వ్యక్తులు, మరోవైపు వాటిని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేసే ఒక కిరాయి ముఠా మధ్య జరిగే మైండ్ గేమ్ ఈ స్టోరీ. ఈ ప్రయాణంలో కార్ డ్రైవర్, ప్రయాణికుల మధ్య వచ్చే సీన్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

Advertisement

Also Read : బయట అడుగు పెడితే చావు మూడినట్టే… గుండెల్లో దడ పుట్టించే జాంబీలు… ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్

ఈ పెట్టెలను దక్కించుకోవడానికి రెండు ముఠాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్తాయి. సినిమా అంతా ఒకే కారు ప్రయాణంలో ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది. ఆ పెట్టెలలో అసలు ఏముంది? అవి చివరికి ఎవరికి దక్కాయి? అనే పాయింట్ ఆసక్తికరంగా సాగుతుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×