E-Paper
Advertisement

OTT Movie : మర్డర్ కేసులో ఇరుక్కునే ఆర్మీ జవాన్… నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్ సిరీస్

OTT Movie : మర్డర్ కేసులో ఇరుక్కునే ఆర్మీ జవాన్… నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ దుమ్ము లేపుతోంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ దీనిని తెగ చూసేస్తున్నారు. ఒక మాజీ మిలిటరీ పోలీస్ ఆఫీసర్ దేశం మీద తిరుగుతూ క్రైమ్‌లు సాల్వ్ చేస్తుంటాడు. ఒక్కో ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. హీరో కూడా మార్వెల్ రేంజ్ లో ఉంటాడు. యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడేవాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘Reacher’. లీ చైల్డ్ రాసిన జాక్ రీచర్ నవలల ఆధారంగా నిక్ సాంటోరా డెవలప్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా ఇది రూపొందింది. అలాన్ రిచ్‌సన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సిరీస్ టామ్ క్రూజ్ మూవీస్‌కు దగ్గరి పోలికలు ఉంటాయి. ఇప్పటి వరకు మూడు సీజన్లు (24 ఎపిసోడ్‌లు) విడుదలై, సీజన్ 4 కూడా కన్ఫర్మ్ అయింది. ఇది Amazon Prime Videoలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ లో ఉంది. ఐయండిబిలో 8.1/10ని పొందింది.

Advertisement

Read Also : మర్డర్ కేసులో మతిపోగొట్టే ఇన్వెస్టిగేషన్… మిస్టరీ అంతా ఆ పర్సులోనే… ఓటీటీలోకి మమ్ముట్టి థ్రిల్లర్

స్టోరీ ఏంటంటే

జాక్ రీచర్ అనే మాజీ యు.ఎస్. ఆర్మీ మిలిటరీ పోలీస్ ఆఫీసర్, రిటైర్ అయిన తర్వాత ఏ ఒక్క చోట ఎక్కువ కాలం ఉండడు. బస్ ఎక్కి దేశం మీద తిరుగుతూ కాలం గడుపుతుంటాడు. ఒక రోజు జార్జియాలోని మార్‌గ్రేవ్‌ అనే చిన్న టౌన్ కు వస్తాడు. కానీ అక్కడికి వచ్చిన వెంటనే ఒక మర్డర్ జరుగుతుంది. పోలీసులు రీచర్‌ను సస్పెక్ట్‌గా అరెస్ట్ చేస్తారు. జైలులో ఉండగా అసలు నేరస్తులు అరెస్ట్ అవుతారు. అక్కడే రీచర్‌కు తన సోదరుడు జో రీచర్ మర్డర్ అయిన విషయం తెలుస్తుంది.

Advertisement

బయటకు వచ్చాక లోకల్ పోలీస్ ఆఫీసర్లతో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మార్‌గ్రేవ్ టౌన్ పైకి శాంతంగా కనిపించినా, లోపల ఒక మాఫియా రాజ్యం నడుస్తుంటుంది. అక్కడ బిజినెస్‌మెన్ క్లింగర్ నకిలీ డాలర్ల చెలామని చేస్తుంటాడు. రీచర్ బ్రదర్ దీన్ని బయటపెట్టడానికి ట్రై చేశాడు కాబట్టి అతన్ని చంపేశారు. రీచర్ తన ఇంటెలిజెన్స్, బ్రూటల్ ఫైటింగ్ స్కిల్స్‌తో ఒక్కొక్కరిని ఎదుర్కొంటాడు. చివరికి మొత్తం కాన్స్పిరసీని బయటపెట్టి, విలన్స్‌ను చంపి టౌన్‌ను క్లీన్ చేస్తాడు. సీజన్ ముగిసేసరికి రీచర్ మళ్లీ రోడ్డు ఎక్కి వెళ్తాడు. సీజన్ 2, సీజన్ 3 లలో కూడా రీచర్ భయంకరమైన కేసులను ఎదుర్కొంటాడు.

 

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×