E-Paper
Advertisement

Mass Jathara OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మాస్ జాతర ‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Mass Jathara OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మాస్ జాతర ‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Advertisement

Mass Jathara OTT: టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహా రాజ రవితేజ, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ జనాలను పెద్దగా ఆకాట్టుకోలేదు. దాంతో రవితేజ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇన్నాళ్లకు ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది.. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి, ఎప్పుడు రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

మాస్ జాతర ఓటీటీ డేట్ లాక్..

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ మాస్ జాతర.. వాల్తేరు వీరయ్య, సామజ వరగమన వంటి విజయవంతమైన చిత్రాలకు డైలాగ్స్ అందించి గుర్తింపును దక్కించుకున్న భాను భోగవరపు ఈ మూవీతో దర్శకుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. అయితే.. ఇప్పుడు ఈ చిత్రం నెల తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఈ మూవీని కొనుగోలు చేసింది. నవంబర్ 27 గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో యావరేజ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

ఈ మూవీలో రవితేజ లక్ష్మణ్‌ భేరీ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించాడు రవితేజ.. ఫైర్ బ్రాండ్ రైల్వే పోలీస్. ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయబడుతూ ఉంటాడు. ఎక్కడికి బదిలీ అయినా రైల్వే స్టేషనే కాకుండా ఆ ఊరి మొత్తాన్ని శుద్ది చేస్తుంటాడు. ఇలాంటి క్రమంలో ఓ ఊరుకు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఉత్తరాంధ్రలోని అడవివరం అనే విలీజ్‌కు ఎంట్రీ ఇస్తాడు. అక్కడ శివుడు నవీన్ చంద్ర.. గంజాయి వ్యాపారంలో కింగ్ అనే చెప్పాలి. కొత్తగా విధుల్లో చేరిన హీరో లక్ష్మణ్‌ శివుడి ఆట ఎలా కట్టించాడు. వీరిద్దరి మధ్య వార్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. విలన్, హీరోల మధ్య జరిగే ఫైట్ జనాలను బాగా ఆకట్టుకుంది. కానీ కొన్ని మైనస్ ల వల్ల మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది.. థియేటర్లలో దెబ్బేసిన మాస్ జాతర ఓటీటీలో ఏ మాత్రం వ్యూస్ ను రాబడుతుందో చూడాలి..

Also Read : మంగళవారం మూవీ మస్తీ.. ఆ సినిమాలను మిస్ అవ్వకండి..

Advertisement

రవితేజ సినిమాల విషయానికొస్తే.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కుర్ర హీరోలకు పోటీగా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి తో పాటుగా మరో మూవీని లైనఫ్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×