E-Paper
Advertisement

YCP Rappa Rappa: వైసీపీ రప్పా..రప్పా రాజకీయం.. కూటమి నేతల్లో భయం భయం

YCP Rappa Rappa: వైసీపీ రప్పా..రప్పా రాజకీయం.. కూటమి నేతల్లో భయం భయం
Advertisement

YCP Rappa Rappa: కేడర్‌లో భయం పొగొట్టాలి.. అదే టైంలో ప్రత్యర్థికి భయం పుట్టించాలి. ఇదే స్ట్రాటజీని అమలు చేస్తోంది వైసీపీ. అందుకే రప్పా..రప్పా డైలాగ్ తో కేడర్ లో జోష్ పెంచే ప్రయత్నాలను ఫ్యాన్ పార్టీ ఆపట్లేదు. జగన్ కనిపిస్తే చాలు.. రప్పా రప్పా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అది ఏపీ అయినా.. తెలంగాణ అయినా సరే పోస్టర్లు వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఆ పోస్టర్లతో వైసీపీ ఏం చెప్పదల్చుకుంది.
రప్పా..రప్పా రాజకీయం

సందర్భం ఏదైనా సరే రప్పా..రప్పానే
జగన్ ప్రతి పర్యటనలో కనిపిస్తున్న పోస్టర్లు
కోర్టుకు వెళ్లినా.. పెళ్లికి వెళ్లినా అవే సీన్లు

Advertisement

రప్పా..రప్పా డైలాగ్ చుట్టే ఏపీ పాలిటిక్స్‌
కేడర్‌ నిరాశలో ఉన్న ప్రాంతాల్లో పోస్టర్లు
కోర్టుకు అటెండ్‌ అయినప్పుడు కూడా నినాదాలు
కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు

ఆ డైలాగ్‌తో కేడర్‌లో కొత్త ఉత్సాహం
కమ్‌ బ్యాక్‌ కావడానికి సిద్ధంగా ఉండాలనే స్ఫూర్తి
కూటమి నేతలపై మానసిక ఒత్తిడి

Advertisement

రప్పా..రప్పా చుట్టే ఏపీ పాలిటిక్స్

రప్పా..రప్పా ఇది ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్. సినిమాలో ఫేమస్ అయినదానికంటే ఎక్కువగానే వైసీపీ నేతలు ఈ డైలాగ్ ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. సందర్భం ఏదైనా సరే రప్పా..రప్పా అంటున్నారు. ఎంతలా అంటే ఈ రప్పా..రప్పా డైలాగ్ చుట్టూనే కొద్దినెలలు ఏపీ పాలిటిక్స్ నడిచింది అంటే జోక్ కాదు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్లు మొదలయ్యాయి. ఈ నినాదం కేవలం రాజకీయ సభలకు మాత్రమే పరిమితం కాలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తమ నాయకుడు పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ పోస్టర్లు ప్రదర్శిస్తూ ప్రత్యర్థిపై తమ బలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

కోర్టుకు అటెండ్ అయినప్పుడు కూడా నినాదాలు

జగన్ కోర్టులకు అటెండ్ అయినప్పుడు కూడా కార్యకర్తల.. రప్పా రప్పా నినాదాలు హోరెత్తాయి. మొన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి మొదలుకొని దారిపొడువునా.. కోర్టు వద్ద కూడా కార్యకర్తలు భారీగా గుమిగూడారు. అక్కడ కూడా 2029లో రప్పా రప్పా అంటూ రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. ఆ సమయంలోనూ వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వినిపించాయి. సీబీఐ కోర్టుకు హాజరైన తీరు చావుకి, పెళ్లికి ఒకే భజంత్రి అనే సామెతను గుర్తు చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

రప్పా..రప్పా నినాదాలతో కేడర్ హంగామా

రీసెంట్ గా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు. జగన్ వచ్చేటప్పుడు.. తిరిగి వెళ్లేటప్పుడు కూడా రప్పా..రప్పా నినాదాలతో కేడర్ హంగామా చేసింది.

ఆ డైలాగ్‌తో కేడర్‌లో కొత్త ఉత్సాహం

ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని నింపేందుకు వైసీపీ రప్పా..రప్పాను వాడుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ఓటమి తాత్కాలికం అని.. మళ్లీ స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ కావడానికి సిద్ధంగా ఉండాలనే స్పూర్తిని వారిలో నింపినట్టు అవుతుందని పార్టీ భావిస్తోంది. రప్పా..రప్పా పోస్టర్లతో అధికార కూటమి పార్టీల నేతలపై మానసిక ఒత్తిడి పెంచినట్టు అవుతుందని వైసీపీ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. సినిమా డైలాగ్‌ను ఉపయోగించడంతో పొలిటికల్ గా యూత్ ను ఎట్రాక్ట్ చేసి వారిలో జోష్ నింపినట్టుగా అవుతుందనేది ఓ స్ట్రాటజీగా తెలుస్తోంది.

Story By Venkatesh, Bigtv Live

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×