E-Paper
Advertisement

ప్రాణం వచ్చే బొమ్మలు… శపించబడిన జోకర్లు… తోడేలు మనుషులు… క్లైమాక్స్ కెవ్వు కేక

ప్రాణం వచ్చే బొమ్మలు… శపించబడిన జోకర్లు… తోడేలు మనుషులు… క్లైమాక్స్ కెవ్వు కేక
Advertisement

The Haunting Hour horror series : రాత్రి ఇంట్లో ఒంటరిగా కూర్చుని టీవీ చూస్తుంటే బొమ్మ ఒక్కసారిగా కళ్లను తిప్పితే? నవ్వించే జోకర్ భయపెట్టే రాక్షసుడిగా మారితే? మనిషిలా కనిపించే వ్యక్తి పౌర్ణమి రాత్రి తోడేలుగా మారిపోతే? చిన్నప్పుడు విన్న భయానక కథలన్నింటినీ తెరపైకి తీసుకొచ్చిన సిరీస్ ‘ఆర్ ఎల్ స్టైన్ ది హాంటింగ్ అవర్’ (R.L. Stine’s The Haunting Hour). 2010లో ప్రారంభమైన ఈ హారర్ ఆంథాలజీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా హారర్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత ఆర్ ఎల్ స్టైన్ రచనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మొత్తం నాలుగు సీజన్లలో అనేక భయానక కథలతో రూపొందిన ఈ షో ఇప్పటికీ హారర్ ప్రేమికుల ఫేవరెట్ జాబితాలో ఉంటుంది.

ప్రతి ఎపిసోడ్‌ ఓ కొత్త అనుభూతి:

ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త కథ. ఒక ఎపిసోడ్‌లో శపించబడిన బొమ్మ కథ ఉంటే, మరో ఎపిసోడ్ లో విచిత్రమైన అద్దం వెనుక దాగిన రహస్యం ఉంటుంది. ఇంకో కథలో సాధారణంగా కనిపించే జోకర్ ప్రాణాంతక శక్తిగా మారిపోతాడు. మరికొన్ని ఎపిసోడ్లలో దెయ్యాలు, రాక్షసులు, తోడేలు మనుషులు, వింత జీవులు ప్రేక్షకులను భయపెడతాయి.

Advertisement

సాధారణ హారర్ సిరీస్‌లా కేవలం జంప్ స్కేర్స్ మీద ఆధారపడకుండా ప్రతి కథలో ఒక మిస్టరీ, ఒక ట్విస్ట్, ఒక ఊహించని ముగింపు ఉండేలా రూపొందించారు. అందుకే ఒక్క ఎపిసోడ్ పూర్తయిన వెంటనే మరో ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లలో వచ్చే మలుపులు చాలా సందర్భాల్లో ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తాయి. పిల్లలు, టీనేజర్లు ప్రధాన పాత్రల్లో కనిపించినా ఇందులోని కొన్ని కథలు పెద్దవాళ్లను కూడా అసౌకర్యానికి గురిచేస్తాయి. చీకటి వాతావరణం, భయపెట్టే మేకప్, వింత జీవుల డిజైన్, ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతం కలిసి ప్రతి కథను మరింత ప్రభావవంతంగా మారుస్తాయి.

హారర్ అభిమానులకు ఈ సిరీస్ ఎందుకు ప్రత్యేకమంటే ఇందులో ఒకే రకమైన కథలు ఉండవు. ప్రతి ఎపిసోడ్ కొత్త భయాన్ని పరిచయం చేస్తుంది. ఒకసారి బొమ్మలు భయపెడితే, మరోసారి జోకర్లు, ఇంకోసారి అడవుల్లో తిరిగే రాక్షసులు ప్రేక్షకులను వెంటాడతారు. అందుకే ఇది బోర్ కొట్టకుండా సాగే హారర్ ప్రయాణంలా అనిపిస్తుంది. మీకు గూస్ బంప్స్ తరహా కథలు, ట్విస్ట్ లతో నిండిన హారర్ ఎపిసోడ్లు, ఒంటరిగా చూసేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకునేంత భయం కలిగించే కథలు ఇష్టమైతే ఆర్ ఎల్ స్టైన్ ది హాంటింగ్ అవర్ తప్పకుండా చూడాల్సిన సిరీస్. అయితే ఒక హెచ్చరిక మాత్రం ఉంది. అర్ధరాత్రి ఒంటరిగా చూస్తే ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఒక్కసారి అనుమానంగా కనిపించే అవకాశం ఉంది!

Advertisement

Read Also : ప్రైవేట్ వీడియోలను అమ్ముకునే అమ్మాయిలు… మెంటలెక్కించే స్పై థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×