E-Paper
Advertisement

శవాలను బుట్టలో పెట్టి పోలీసులకు లెటర్… డిపార్ట్మెంట్ కు తిన్నకూడు అరక్కుండా చేసే ఇండియన్ సైకో

శవాలను బుట్టలో పెట్టి పోలీసులకు లెటర్… డిపార్ట్మెంట్ కు తిన్నకూడు అరక్కుండా చేసే ఇండియన్ సైకో
Advertisement

Crime Thriller Series : అది ఢిల్లీ.. ఉదయం.. ప్రాంతం ఓ ప్రముఖ జైలు..! అక్కడ గేటు బయట పోలీసులు చూసిన దృశ్యం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. తల తెగిపోయిన ఒక శవం.. పక్కనే ఒక లెటర్‌..పోలీసులకే సవాల్ విసురుతూ రాసిన ఆ లెటర్ చూసి ఖాకీలు సైతం షాక్ అయ్యారు. ఆ తర్వాత బయటపడిన నిజాలు మొత్తం పోలీసు వ్యవస్థను ఉలిక్కిపడేలా చేశాయి. నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ ట్రూ క్రైమ్ డాక్యుసిరీస్ భారత్‌లో అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్ కేసుల్లో ఒకదాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిది. మొత్తం మూడు ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

లేఖలతో భయపెట్టేవాడు:

ఈ కథ 2006లో ఢిల్లీలో జరిగిన వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో శవాలు కనిపించడం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో శరీర భాగాలు విడిగా కనిపిస్తాయి. మరికొన్ని చోట్ల హత్యలకు సంబంధించిన భయంకరమైన ఆధారాలు లభిస్తాయి. అయితే ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది హంతకుడి ప్రవర్తనే. ప్రతి హత్య తర్వాత అతను పోలీసులను ఎగతాళి చేస్తూ లేఖలు పంపేవాడు. తనను పట్టుకునే శక్తి పోలీసులకు లేదని బహిరంగంగా సవాల్ చేసేవాడు. హత్యలు చేయడమే కాకుండా వాటిని ఒక ఆటగా భావిస్తూ వ్యవహరించిన తీరు దర్యాప్తు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అతని ప్రతి అడుగు వెనుక ఒక ప్రణాళిక ఉండేది. ప్రతి నేరం వెనుక ఒక మెసేజీ ఉండేది.

Advertisement

సిరీస్‌లో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లు, కేసు దర్యాప్తు తీరు, హంతకుడి మానసిక స్థితి, అతని గతం గురించి ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా నేరస్థుడి ఆలోచనా విధానం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ డాక్యుమెంటరీ స్పష్టంగా వివరిస్తుంది. ఒక వ్యక్తి ఎలా ఇంత క్రూరంగా మారాడు అనే ప్రశ్నకు సమాధానాలు వెతికే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తుంది.

ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలు, సీరియల్ కిల్లర్ కేసులు, పోలీసు దర్యాప్తు కథలు ఇష్టపడేవారికి ఇది తప్పక చూడాల్సిన సిరీస్. అయితే ఒక విషయం మాత్రం ఖాయం. ఈ కేసు గురించి తెలుసుకున్న తర్వాత ఆ హంతకుడి ధైర్యం చూసి ఆశ్చర్యపోతారు. అతని క్రూరత్వం చూసి భయపడతారు.

Advertisement

Read Also : నిబ్బా నిబ్బి లవ్ స్టోరీకి ఇంత క్రేజా… మోస్ట్ ఇన్‌స్టా ట్రెండింగ్ మలయాళం మూవీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×