E-Paper
Advertisement

ఇది దెయ్యం కథ కాదు.. కానీ అంతకంటే భయంకరమైన సైకలాజికల్ థ్రిల్లర్

ఇది దెయ్యం కథ కాదు.. కానీ అంతకంటే భయంకరమైన సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller OTT : కొన్ని సినిమాలు సస్పెన్స్ తోనే ఒంట్లో వణుకు పుట్టిస్తుంటాయి. క్లైమాక్స్ వరకు అసలు ట్విస్ట్ రివీల్ అవ్వకుండా ఆడియన్స్ ను టెన్షనలో పెడుతుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇందులో దెయ్యాలను చూపించకపోయినా, సస్పెన్స్, మిస్టరీతో సినిమాను ఓ రేంజ్ లో తెరకెక్కించారు. ఈ సినిమాను అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న దట్టమైన అడవులు, పాత కాలపు భవంతుల్లో చిత్రీకరించారు. ఆ వాతావరణం ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు కావాల్సిన భయంకరమైన మూడ్‌ని పక్కాగా సెట్ చేసింది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘టేక్ ఫ్రమ్ మీ’ (Take from Me). 2025లో వచ్చిన ఈ సినిమాకు వెస్ట్ ఎల్‌డ్రెడ్జ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఈథన్ మెక్‌డోవెల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈయన గతంలో ‘ద వాకింగ్ డెడ్’ వంటి పాపులర్ సిరీస్‌లలో కనిపించారు. ఆయనతో పాటు కైలా డయాన్, డ్వేన్ అలీస్టర్ థామస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను వెస్ట్ ఎల్‌డ్రెడ్జ్ స్వయంగా రాసి దర్శకత్వం వహించారు. మొదట్లో ఈ సినిమాకు ‘లవ్ డాగ్స్’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు, కానీ తర్వాత కథకు తగ్గట్టుగా ‘టేక్ ఫ్రమ్ మీ’ అని మార్చారు. ఇది పెద్ద థియేటర్లలో కాకుండా నేరుగా Tubi, Plex డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లలో విడుదలై, తక్కువ బడ్జెట్‌లో తీసిన మంచి ఇండిపెండెంట్ హారర్ చిత్రంగా గుర్తింపు పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా జాన్ హార్కర్ అనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన భార్య చనిపోయిన బాధలో ఒంటరిగా ఉంటాడు. అయితే ఈ సమయంలోనే తన ఇంటిని ఎలిజబెత్ అనే ఒక కొత్త అమ్మాయికి అమ్మేస్తాడు. అయితే ఆ అమ్మాయి రాకతో జాన్ జీవితం మెల్లగా మారుతుంది. ఆమె అందానికి, ప్రవర్తనకు ఆకర్షితుడై ఆమె చుట్టూనే తిరగడం మొదలుపెడతాడు. అదే సమయంలో ఆ ఊరిలో ఒక వ్యక్తి హఠాత్తుగా అదృశ్యమవడంతో కలకలం రేగుతుంది. ఆ ఊరి పోలీస్ అధికారికి ఈ విషయం మీద అనుమానం వస్తుంది. ఆ అదృశ్యం వెనుక ఏదో బలమైన రహస్యం ఉందని నమ్ముతాడు. మరో వైపు జాన్ మాత్రం ఎలిజబెత్ మాయలో పడి, తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించలేనంతగా ఆమెకు దగ్గరవుతాడు. జాన్ తన గతాన్ని మర్చిపోవడానికి ఆమెను నమ్మినా, ఆమె వెనుక ఒక భయంకరమైన ఉద్దేశం ఉందని చివరకు అర్థమవుతుంది. అసలు ఎలిజబెత్ ఎవరు? ఆమె ఆ ఊరికి ఎందుకు వచ్చింది? ఆ మిస్సింగ్ వెనుక ఎవరు ఉన్నారు ? ఆ ప్రమాదం నుండి జాన్ ఎలా బయటపడ్డాడు ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఓటీటీని వణికిస్తున్న హారర్ ఫ్రాంచైజీలు… వీటి పోస్టర్ చూస్తేనే మీలో భయం పడుతుంది

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×