E-Paper
Advertisement

ప్రేమ కోసం రిస్క్ చేసే ప్రియురాలు… ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్

ప్రేమ కోసం రిస్క్ చేసే ప్రియురాలు… ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్
Advertisement

Action Thriller OTT : కొన్ని సినిమాలు చివరి వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా నడుస్తుంటాయి. అలాంటి సినిమాలు ఎక్కాడా బోర్ కూడా కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా అలాంటిదే. ఇందులో హీరోయిన్ చేసే కార్ చేసింగ్ సీన్స్ కు విజిల్స్ పడతాయి. ఆమె యాక్షన్ ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. గత ఏడాది థియేటర్లలో హిట్ అయిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా అలరిస్తోంది.

జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ 

ఈ అమెరికన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఈనీ మీనీ’ (Eenie Meanie). 2025లో వచ్చిన ఈ సినిమాను షాన్ సిమన్స్ డైరెక్ట్ చేశారు. ఈయన అంతకుముందు ‘వేన్’ అనే పాపులర్ యాక్షన్ కామెడీ సిరీస్‌ని క్రియేట్ చేశారు. అందుకే ఈ సినిమాలో కూడా అదే తరహాలో డార్క్ హ్యూమర్, స్పీడ్ యాక్షన్ కనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సమర వీవింగ్ తన డ్రైవింగ్ స్కిల్స్‌తో అదరగొట్టింది. ఆమె గతంలో ‘రెడీ ఆర్ నాట్’ వంటి సినిమాలతో ఫేమస్ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ఆమె క్యారెక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. ఇది 2025 ఆగస్టు 22న థియేటర్లలో అడుగుపెట్టి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ (JioHotstar)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎడీ అనే అమ్మాయి ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్ల దగ్గర కారు డ్రైవర్‌గా పని చేసేది. దొంగతనం జరిగిన తర్వాత పోలీసుల కళ్లు గప్పి వాళ్లను తప్పించడంలో ఆమె దిట్ట. కానీ ఆ పాత గొడవలన్నీ వదిలేసి, ప్రశాంతంగా బతకాలని ఆ ఊరు విడిచిపెట్టి వచ్చేస్తుంది. అలా కొత్త జీవితం మొదలుపెట్టి సెటిల్ అయిపోతుంది. కానీ ఆమె పాత ప్రియుడు జాన్ వల్ల మళ్ళీ చిక్కులు మొదలవుతాయి. అతను ఒక డేంజరస్ గ్యాంగ్‌స్టర్ దగ్గర భారీగా అప్పు చేసి, అది తీర్చలేక ప్రాణాపాయంలో పడతాడు. ఇప్పుడు అతన్ని ఎలాగైనా కాపాడాలని ఎడీ మళ్ళీ రంగంలోకి దిగాల్సి వస్తుంది. అతన్ని రక్షించడానికి ఎడీ మళ్ళీ తన పాత డ్రైవింగ్ స్కిల్స్ బయట తీస్తుంది. ఒక పక్క పోలీసులు, మరోపక్క రౌడీలు వెంటాడుతుంటే.. వాళ్ళందరినీ తన తెలివితేటలతో, రాష్ డ్రైవింగ్‌తో ముప్పతిప్పలు పెడుతుంది. చివరకు ఆమె ఆ గ్యాంగ్ నుండి ఎలా బయటపడింది ? తన మాజీ ప్రియున్ని రక్షించిందా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : గుండెల్లో వణుకు పుట్టించే సముద్రపు దొంగలు… వన్ పీస్ ను మించిన అడ్వెంచర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×