E-Paper
Advertisement

ఆ పీడకలల వెనుక వింత శాపం… నిద్రపోవాలంటేనే భయం పుట్టించే హారర్ థ్రిల్లర్

ఆ పీడకలల వెనుక వింత శాపం… నిద్రపోవాలంటేనే భయం పుట్టించే హారర్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller OTT : కొన్ని సినిమాలు పక్కా మైండ్ గేమ్‌ లా ఆడియన్స్ ను కన్ఫ్యూస్ చేస్తూ భయపెడుతుంటాయి. క్లైమాక్స్ వరకు చూస్తే గాని అసలు విషయం అర్థం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా అలాంటిదే. ఇది మామూలు దెయ్యం సినిమాల్లాగా టక్కున భయపెట్టే రకం కాదు. కానీ చూస్తున్నంత సేపు ఏదో తెలియని టెన్షన్ పెడుతూనే ఉంటుంది. తల్లికి వచ్చే పీడకలల వెనుక ఉన్న నిజాన్ని కూతురు వెతకడం, ఆ ఊరి జనాల వింత ప్రవర్తన.. ఇలా సినిమా అంతా చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. సినిమా మొత్తం సుమారు 102 నిమిషాల పాటు ఉంటుంది. ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోనివ్వదు ఈ సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే

2020లో వచ్చిన ఈ జర్మన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘స్లీప్’ (Sleep). దీనికి మైఖేల్ వీనస్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో సాండ్రా హుల్లర్ (మార్లిన్ పాత్రలో) గ్రో స్వంట్జే కోల్‌హాఫ్ (మోనా పాత్రలో) నటించారు. ఇక హోటల్ యజమాని ఒట్టో పాత్రలో అగస్ట్ ష్మోల్జర్ నటించారు. ఈ సినిమాలోని విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఒక రకమైన భయాన్ని కలిగిస్తాయి. అందుకే విమర్శకులు ఈ సినిమాను కేవలం హారర్ అనడం కంటే, ఒక గొప్ప ఆర్ట్ ఫిల్మ్ అని ప్రశంసించారు. ఇక మోనా పాత్రలో నటించిన గ్రో స్వంట్జే కోల్‌హాఫ్ తన అద్భుతమైన నటనతో సినిమాను నడిపించారు. ఈ సినిమా 2020లో విడుదలైనప్పటికీ, దీనిలోని మేకింగ్ స్టైల్ వల్ల ఇప్పటికీ ఇది ఒక మంచి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది. ఈ చిత్రం 2020లో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అలాగే ఇది 2023లో గ్రిమ్మ్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ముబి, ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమాలో మార్లిన్ అనే మహిళకు తరచుగా భయంకరమైన కలలు వస్తుంటాయి. ఒకరోజు ఆమె ఒక ఊరి గురించి కలగని, నిజంగానే ఆ ఊరు ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితుల వల్ల షాక్‌కు గురై ఆస్పత్రిలో చేరుతుంది. దీంతో తన తల్లికి పీడకలలు రావడానికి, ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలని ఆమె కూతురు మోనా ఆ ప్రాంతానికి బయలుదేరుతుంది. మోనా ఆ ఊర్లోని ఒక పాత హోటల్‌లో స్టే చేస్తుంది. అక్కడ ఉంటున్న కొద్దీ ఆమెకు వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ ఊరి ప్రజలు ఏదో దాస్తున్నారని ఆమెకు అర్థమవుతుంది.

గతంలో అక్కడ జరిగిన కొన్ని ఘోరాలు, ఆత్మహత్యల వల్ల ఆ ప్రాంతం ఒక రకమైన శాపానికి గురైందని, ఆ ప్రభావమే తన తల్లి మీద పడిందని మోనా గుర్తిస్తుంది. ఇక ఆ హోటల్ యజమానులు చేసే అక్రమాలు, రహస్యాలను మోనా ఎలా బయటపెట్టింది అనేదే మిగతా కథ. చివరికి తల్లిని ఆ పీడకలల నుండి మోనా బయట పడేస్తుందా ? అసలు ఆ హోటల్ రహస్యం ఏమిటి ? మోనా తల్లికి, ఆ హోటల్ కి ఉన్న సంబంధం ఏమిటి ? అనే విషయాలను ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : దెయ్యాలు కూడా జడుసుకునే ఘోరాలు… లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసినా చలించని రాక్షస జంట

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×