E-Paper
Advertisement

తల్లిపై కోపంతో దెయ్యాన్ని పిలిచే కూతురు… సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లర్

తల్లిపై కోపంతో దెయ్యాన్ని పిలిచే కూతురు… సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లర్
Advertisement

Horror Thriller OTT : దెయ్యాల సినిమాలు చాలా క్రేజీగా ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చే సౌండ్స్, వింత ఆకారాలతో ఆడియన్స్ ను ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. అయితే డిఫరెంట్ హారర్ కంటెంట్ తో భయపెడుతోంది ఒక హాలీవుడ్ హారర్ మూవీ. ఇది తల్లిపై కూతురు చేతబడి చేస్తుంది. ఆ తరువాత సాగే కథ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా సాగుతూ, ఒక షాకింగ్ ముగింపుతో మనల్ని ఆలోచింపజేస్తుంది కూడా. ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా తల్లికూతుళ్ల మధ్య ఉండే సంబంధాన్ని హారర్ కోణంలో చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ కెనడియన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘పీవాకెట్’ (Pyewacket). ఆడమ్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నికోల్ మునోజ్, లారీ హోల్డన్ లీడ్ రోల్స్ లో నటించారు. చిత్రానికి సంగీతం అందించిన లీ మాలియా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘బ్రింగ్ మీ ద హారిజన్’ అనే రాక్ బ్యాండ్‌లో సభ్యుడు. ఆయన అందించిన సంగీతం సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ వాడకుండా, కేవలం సౌండ్స్, నటీనటుల హావభావాలతోనే ప్రేక్షకులను టెన్షన్ పెట్టడం ఈ సినిమా స్పెషాలిటీ. తక్కువ బడ్జెట్‌తో తీసినా, 2017 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై విమర్శకుల నుండి మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథలో ఒక ఇంట్లో తండ్రి చచ్చిపోతే, ఆ బాధ తట్టుకోలేక తల్లి కూతురు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. ఆ పిల్లకు వాళ్ళమ్మ మీద విపరీతమైన కోపం వచ్చేసి, ఆవేశంలో ఒక క్షుద్ర పూజ చేసే పుస్తకం కొంటుంది. అడవిలోకి వెళ్లి తన రక్తం చిందించి, వాళ్ళమ్మని చంపేయమని ‘పీవాకెట్’ అనే ఒక దయ్యాన్ని పిలుస్తుంది. అప్పుడు అది ఏదో సరదాకి చేసినట్టు అనిపించినా, అసలు కథ అక్కడే మొదలవుతుంది.
క్షుద్ర పూజ చేసిన కొద్దిసేపటికే ఆ పిల్లకు భయం పట్టుకుంటుంది. ఎంత పని చేశాను, అమ్మని చంపమని దయ్యాన్ని కోరుకోవడం ఏంటని బాధపడి, ఆ దయ్యాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మని మళ్ళీ ఇంకో పూజ చేస్తుంది.

కానీ ఆ పీవాకెట్ దయ్యం అంత ఈజీగా వదిలేది కాదు. ఇంట్లో వింత వింత శబ్దాలు రావడం, ఎవరో తిరుగుతున్నట్టు అనిపించడం మొదలవుతుంది. ఆ దయ్యం తన రూపాన్ని మార్చుకుంటూ ఆ పిల్లను పిచ్చెక్కించడం స్టార్ట్ చేస్తుంది. ఇక చివరికి వచ్చేసరికి తన ముందు ఉన్నది తన అమ్మో లేక దయ్యమో అర్థం కాక ఆ పిల్లకి పిచ్చెక్కిపోతుంది. చివరికి ఆ దెయ్యం వచ్చిన పని ముగిస్తుందా ? దాని నుంచి ప్రాణాలతో వీళ్ళు బయట పడతారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : పెళ్లి పీటల మీద ప్రియురాలిని వదిలేసే ప్రియుడు… కట్ చేస్తే ఏడేళ్ల కూతురితో అదిరిపోయే ప్రేమకథ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×