// // Psycho Thriller OTT : కిల్లర్ వరుస హత్యలు... తాగుబోతు పోలీస్ -->
E-Paper
Advertisement

Psycho Thriller OTT : కిల్లర్ వరుస హత్యలు… తాగుబోతు పోలీస్ మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్

Psycho Thriller OTT : కిల్లర్ వరుస హత్యలు… తాగుబోతు పోలీస్ మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్
Advertisement

Psycho Thriller OTT : మలయాళం సినిమాలు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయాయి. ఇలాంటి జోనర్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తే చాలు ఆడియన్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. అయితే దశాబ్ధం క్రితం పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఒక మూవీ, మలయాళ సినిమాలో అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఇది అప్పటి నుండి కల్ట్ హోదాను కూడా పొందింది. ఈ స్టోరీ ఒక తాగుబోతు పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను వరుస హత్యలను దర్యాప్తు చేయవలసి చేస్తూ, కిల్లర్ ని పట్టుకోవాల్సి వస్తుంది. సినిమాలో ఊహించని ట్విస్ట్లు ఉంటాయి. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు ‘మెమోరీస్’ (Memories). ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఎస్. పి. శ్రీకుమార్, మేఘన రాజ్, మియా జార్జ్, విజయరాఘవన్, సురేష్ కృష్ణ, రాహుల్ మాధవ్, వనితా కృష్ణచంద్రన్ నటించారు. ఇది 2013 ఆగస్టు 9 న విడుదలై కమర్షియల్ గా కూడా విజయవంతమైంది. ఆ తరువాత దీనిని తమిళంలో ‘ఆరతు సినం’ అనే పేరుతో తీయడం జరిగింది. ఈ థ్రిల్లర్ సినిమాకు ఐయండిబిలో 8.0/10 రేటింగ్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ jio hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  ఆఫీస్ లో ఒక్కొక్కరు మిస్సింగ్… వెన్నులో వణుకు పుట్టించే కొరియన్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే 

పోలీస్ ఆఫీసర్ అయిన సామ్ అలెక్స్ (పృథ్వీరాజ్) తన భార్య, కూతురుతో సంతోషంగా ఉండేవాడు. అయితే ఒక నేరస్థుడి చేతిలో భార్య, కూతురు హత్యకు గురవ్వడాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. ఆ బాధను మర్చిపోవడానికి అతను మద్యానికి బానిసై, విధులకు దూరంగా ఉంటాడు. అయితే నగరంలో వరుసగా జరుగుతున్న వింతైన హత్యలు పోలీసులకు సవాలుగా మారుతాయి. కిల్లర్ మృతదేహాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేలాడదీయడం, అక్కడ బైబిల్ సంబంధిత ఆధారాలను వదిలిపెట్టడం చూసి పోలీసులు అయోమయంలో పడతారు. ఈ కేసును ఛేదించడానికి సామ్ అలెక్స్ మాత్రమే సరైన వ్యక్తి అని భావించిన అతని పైఅధికారి, అతన్ని మళ్ళీ విధుల్లోకి తీసుకువస్తాడు.

Advertisement

ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించిన సామ్, చనిపోయిన వారందరికీ ఒకే రకమైన గతం ఉందని గుర్తిస్తాడు. ఆ హంతకుడు కేవలం ప్రతీకారం కోసం కాకుండా, ఒక మతపరమైన ఉన్మాదంతో ఈ హత్యలు చేస్తున్నాడని సామ్ కనిపెడతాడు. హంతకుడు తన తదుపరి లక్ష్యం సామ్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి అని తెలిసినప్పుడు కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. చివరకు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు ? అనే రహస్యాలను సామ్ ఎలా ఛేదించి, తన వారిని కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా ముగింపు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×