E-Paper
Advertisement

Psycho Movie OTT : టైమ్ లూప్ లో ఇరుక్కుపోయే కిల్లర్… అమ్మాయిలతో అదే పని… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

Psycho Movie OTT : టైమ్ లూప్ లో ఇరుక్కుపోయే కిల్లర్… అమ్మాయిలతో అదే పని… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్
Advertisement

Psycho Movie OTT : సైకో కిల్లర్ సినిమాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా ఇలాంటి సినిమాలలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చూస్తేనే చాలు అన్పిస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం కిల్లర్ మళ్ళీ మళ్ళీ వచ్చి అమ్మాయిలకు నరకం చూపిస్తాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2010లో విడుదలైన కెనడియన్ సై-ఫై థ్రిల్లర్-డ్రామా మూవీ ‘రిపీటర్స్’ (Repeaters) . ఇది టైమ్ లూప్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్. రియలిస్టిక్‌గా, భావోద్వేగపూరితంగా, మోరల్ డైలమాలతో నిండిన సినిమా. ప్రధాన పాత్రల్లో డస్టిన్ మిలిగన్ (మైఖేల్), రిచర్డ్ డెర్ఫ్ (బాబ్), అమాండా క్రూజ్ (సారా) నటించారు. సినిమా చాలా ఇంటెన్స్‌గా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం Prime Videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Also Read : ఒకరితో ఒకరికి సంబంధం లేని ఏడుగురు ఒకే హోటల్లో… నరాలు కట్టయ్యే సస్పెన్స్ ఉన్న సినిమా

కథలోకి వెళ్తే…

మైఖేల్ (డస్టిన్ మిలిగన్), బాబ్ (రిచర్డ్ డెర్ఫ్), సారా (అమాండా క్రూజ్) ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఒక రిహాబ్ సెంటర్‌లో డ్రగ్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటారు ఈ ముగ్గురు. కానీ ఒక రోజు వాళ్లు ఆ సెంటర్ నుంచి ఎస్కేప్ అవుతారు. అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న గ్రామంలోని ఒక బార్‌ లో పార్టీ చేసుకుంటారు. అక్కడ వాళ్లు ఒక అసాధారణ డ్రగ్ (హాలుసినోజెనిక్ కెమికల్)ను తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం లేచినప్పుడు వాళ్లు అదే రోజు మళ్లీ రిపీట్ అవుతోందని తెలుసుకుంటారు.

Advertisement

అంటే వాళ్లు ఒకే రోజును టైమ్ లూప్‌లో జీవిస్తున్నారు అన్నమాట. రాత్రి అయిపోయిన తర్వాత మళ్లీ అదే రోజు ఉదయం స్టార్ట్ అవుతుంది. అలాగే ఆరోజు జరిగిన ఈవెంట్స్ రిపీట్ అవుతాయి. మొదట్లో ముగ్గురూ ఈ లూప్‌ ను ఎంజాయ్ చేస్తారు. అందుకే బ్యాంక్ లూట్ చేయడం, పోలీసులతో గొడవ పడటం, డ్రగ్స్, పార్టీలు అన్నీ చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత టైమ్ లూప్ వల్ల భయంకరమైన పరిణామాలు స్టార్ట్ అవుతాయి.

ఒకరోజు వాళ్లు ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేసిన ఘటన రిపీట్ అవుతుంది. మైఖేల్ దాన్ని ఆపాలని ప్రయత్నిస్తాడు కానీ ఫెయిల్ అవుతాడు. ఈ ఘటన వాళ్ల మధ్య గొడవలు తెస్తుంది. లూప్ ఎందుకు జరుగుతుందో తెలియదు. కానీ మైఖేల్ ఈ రోజును మార్చాలని అనుకుంటాడు. అసలు వీళ్ళంతా ఆ టైమ్ లూప్ లో ఎలా చిక్కుకున్నారు ? చివరికి దాని నుంచి బయట పడ్డారా లేదా ? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం మిస్ అవ్వకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×