E-Paper
Advertisement

Psycho killer OTT: డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే సైకో… ఒక్కో మర్డర్ చూస్తే మతిపోవడం ఖాయం

Psycho killer OTT: డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే సైకో… ఒక్కో మర్డర్ చూస్తే మతిపోవడం ఖాయం
Advertisement

Psycho killer OTT : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఆడియన్స్ కి ఫేవరెట్ అయిపోయాయి. ఇక వీటిలో సైకో కిల్లర్ స్టోరీలను అస్సలు వదలడం లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 1986, 1991 మధ్య దక్షిణ కొరియాలో లీ చూన్-జే అనే సీరియల్ కిల్లర్ చేసిన రియల్ హత్యల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా 21వ శతాబ్దపు గొప్ప చిత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించిన ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మెమోరీస్ ఆఫ్ మర్డర్’ (Memories of Murder). 2003లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్ కాంగ్-హో, కిమ్ సాంగ్-క్యుంగ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా దక్షిణ కొరియాలో 2003 మే 2న CJ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా థియేటర్‌లలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది అనేక అవార్డులను కూడా అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1986లో దక్షిణ కొరియాలోని ఒక చిన్న ఊరిలో వరుసగా మహిళల హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరి పోలీసులు చాలా పాత పద్ధతుల్లో, ఎవరిని పడితే వారిని కొట్టి ఒప్పించి కేసు క్లోజ్ చేయాలని చూస్తారు. కానీ హత్యలు మాత్రం ఆగవు. అప్పుడు సీయోల్ నుండి ఒక తెలివైన డిటెక్టివ్ అక్కడికి వస్తాడు. పోలీసుల పద్ధతులు, ఈ కొత్త డిటెక్టివ్ ఆలోచనలు కలవక ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతాయి. అయినా సరే, వర్షం పడే రాత్రి పూట ఎర్రటి బట్టలు వేసుకున్న మహిళలే టార్గెట్ అవుతున్నారని గుర్తించి హంతకుడి కోసం డిటెక్టివ్ వేట మొదలుపెడతాడు.

చాలా ప్రయత్నాల తర్వాత ఒక యువకుడి మీద అనుమానం వస్తుంది. వాడే హంతకుడు అని దాదాపు కన్ఫర్మ్ అవుతుంది కానీ, అప్పట్లో వాళ్ళ దగ్గర సరైన ఫోరెన్సిక్ టెక్నాలజీ (DNA టెస్ట్) ఉండదు. టెస్ట్ కోసం శాంపిల్స్ అమెరికాకు పంపి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తారు. చివరకు ఆ రిపోర్ట్ నెగటివ్‌గా రావడంతో పోలీసులు, డిటెక్టివ్ నిరాశ చెందుతారు. ఇక ఈ సినిమా ముగింపులో హీరో కెమెరా వైపు నేరుగా చూస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ సినిమా చరిత్రలోనే పత్యేకత చాటుకుంది. అప్పట్లో హంతకుడు ఎవరో తెలియనందున, వాడు ఎక్కడో ఒకచోట ఈ సినిమా చూస్తూనే ఉంటాడనే ఉద్దేశంతో దర్శకుడు అలా చిత్రీకరించారు. చివరగా ఈ సినిమా వచ్చిన 16 ఏళ్ల తర్వాత డీఎన్ఏ ఆధారంగా అసలు హంతకుడిని పోలీసులు గుర్తించారు. వాడు అప్పటికే మరో హత్య కేసులో జైలులో ఉన్నాడు.

Advertisement

Read Also :  పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×