E-Paper
Advertisement

Allu Arjun AA23: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ తో చేయి కలిపిన అతని నలుగురు స్నేహితులు..!

Allu Arjun AA23: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ తో చేయి కలిపిన అతని నలుగురు స్నేహితులు..!
Advertisement

Allu Arjun AA23: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత, క్రేజ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ ప్రాజెక్ట్‌ను #AA23గా పిలుస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితులైన నలుగురు స్నేహితులు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా చేరారు. ఇది ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఈ నలుగురిలో ముఖ్యమైనవాడు బన్నీ వాస్. చాలా ఏళ్లుగా అల్లు అర్జున్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఆయన పేరు ఉంది. ప్రతి విషయంలోనూ బన్నీకి బన్నీ వాస్ అంటే పూర్తి విశ్వాసం. ఇటీవల బన్నీ వాస్ ప్రారంభించిన ‘బీవీ వర్క్స్’ బ్యానర్ కూడా ఈ సినిమాతో కలిసి ప్రయాణిస్తోంది. చిన్న, మధ్య తరహా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ సంస్థ ముందుకు వెళ్తోంది. #AA23 బీవీ వర్క్స్‌కు తొలి భారీ ప్రాజెక్ట్ కావడం విశేషం.

ఇక మిగతా ముగ్గురు స్నేహితులు స్వాతి, నటరాజ్, సందీప్ రామినేని. నటరాజ్, సందీప్ అల్లు అర్జున్‌కు స్కూల్ రోజుల నుంచి స్నేహితులు కాగా, స్వాతి ఆయన కజిన్ అలాగే చిన్నప్పటి నుంచి దగ్గరి వ్యక్తి. అల్లు అర్జున్ తన స్నేహితులను ప్రోత్సహిస్తూ, తనతో పాటు ఎదగాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాడని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు.

Advertisement

సాధారణంగా స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత పాత స్నేహితులను మర్చిపోతారనే భావన ఉంటుంది. కానీ అల్లు అర్జున్ విషయంలో అది కనిపించదు. గతంలో కూడా ఆయన తన బంధువుల సంస్థ ‘ముత్తంసెట్టి మీడియా’ను పుష్ప మొదటి భాగం నిర్మాణంలో భాగస్వామ్యంగా చేర్చారు. ఇప్పుడు అదే విధంగా #AA23లోనూ తన సన్నిహితులను ముందుకు తీసుకొస్తున్నారు.

స్నేహం, నమ్మకం, కలిసి ఎదగాలనే ఆలోచన అల్లు అర్జున్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. అభిమానులు కూడా ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

ALSO READ: Sree vishnu: విష్ణు విన్యాసం, మృత్యుంజయ విడుదలపై శ్రీ విష్ణు క్లారిటీ.. బయటపడ్డానంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×