E-Paper
Advertisement

Baahubali: The Epic OTT : ‘బాహుబలి: ది ఎపిక్’ ఓటీటీ స్ట్రీమింగ్… నెట్ ఫ్లిక్స్ పై గుర్రుగా ఉన్న తెలుగు ఆడియన్స్

Baahubali: The Epic OTT : ‘బాహుబలి: ది ఎపిక్’ ఓటీటీ స్ట్రీమింగ్… నెట్ ఫ్లిక్స్ పై గుర్రుగా ఉన్న తెలుగు ఆడియన్స్
Advertisement

Baahubali: The Epic OTT : జక్కన్నతో పాటు ప్రభాస్, రానా, అనుష్క అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ఎట్టకేలకు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై తెలుగు ఆడియన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు. అసలు టాలీవుడ్ ప్రేక్షకులకు అలా కోపం రావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లను కలిపి ఒకే చిత్రంగా… ‘బాహుబలి: ది ఎపిక్’ అనే పేరుతో ఒకే ఎడిటెడ్ వెర్షన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 3 గంటల 43 నిమిషాల నిడివి గల ఈ మూవీ థియేటర్లలో మరోసారి దుమ్మురేపింది. 2025 అక్టోబర్‌లో బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతోంది. అయితే ఈ ఓటీటీ విడుదల తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.

Advertisement

ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమా హిందీలో మాత్రమే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. నెట్ ఫ్లిక్స్ చేసిన ఈ పని చాలా మంది ప్రేక్షకులను నిరాశపరిచింది. చాలామంది తెలుగు వెర్షన్ ముందుగా అందుబాటులో ఉంటుందని ఆశించారు. కానీ అది జరగకపోగా, తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదలకు సంబంధించి నిర్మాతలు లేదా నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం ఆడియన్స్ ను అసహనానికి గురి చేస్తోంది. ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆడియన్స్. కాగా ఇందులో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించగా, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also : ఒక్కరాత్రిలో 5 మంది హత్య… మర్డర్స్ తో పోలీస్ కే కనెక్షన్… మైండ్ బెండయ్యే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

బాహుబలి కథ గురించి ఆడియన్స్ ను పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే థియేటర్స్‌తో పాటు ఓటీటీ, టీవీలలో చాలా సార్లు ఈ మూవీ వచ్చింది. కాగా మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి (రమ్యకృష్ణ) తన ప్రాణాలను పణంగా పెట్టి, కొడుకు భళ్లాల దేవ నుంచి మహేంద్ర బాహుబలి (ప్రభాస్‌)ని కాపాడుతుంది. అతను ఓ గూడెంలో పెరిగి పెద్దవాడు అవుతాడు. ప్రియురాలు అవంతిక (తమన్నా) ఆశయం నెరవేర్చడానికి మాహిష్మతి రాజ్యానికి పయనమవుతాడు. ఈ క్రమంలోనే అక్కడ తన తల్లి దేవసేన (అనుష్క శెట్టి) బందీగా ఉందని, భళ్లాల దేవుడు (రానా) తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపించి, మాహిష్మతి సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడని తెలుసుకుంటాడు. కట్టప్ప (సత్యరాజ్‌) సాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి పెద్ద యుద్ధమే చేస్తాడు. చివరకు భళ్లాల దేవుడిని అంతమొందించి, అతను రాజు అవుతాడు.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×