E-Paper
Advertisement

OTT Movie : సైకో ప్లే బాయ్ చేతికి చిక్కి అల్లాడే అమ్మాయిలు… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉన్న సైకో కిల్లర్ మూవీ

OTT Movie : సైకో ప్లే బాయ్ చేతికి చిక్కి అల్లాడే అమ్మాయిలు… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉన్న సైకో కిల్లర్ మూవీ
Advertisement

OTT Movie : ఇప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి వైపే చూస్తున్నారు. వీటిలో వచ్చే వెబ్ సిరీస్ లను, సినిమాలను చూస్తూ ఆనందిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, వెబ్ సిరీస్ లను భాషతో ప్రమేయం లేకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చింది. ఒక సైకో అమ్మాయిలను బంధించి చిత్రహింసలు పెడతాడు. ఈ అమ్మాయిలు అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో స్టోరీ ఓ రేంజ్ లో సాగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ స్టోరీ ముగ్గురు యువతులు అల్లిసన్ (సాన్యా లోపెజ్), రోనీ (కొలీన్ గార్సియా), పట్రిసియా (ఫే లోరెంజో) చుట్టూ తిరుగుతుంది. అల్లిసన్ ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్, రోనీకి తొందర్లోనే పెళ్లి జరగబోతోంది. పట్రిసియా ఇటీవలే లవర్ కి బ్రేక్ అప్ చెప్పి సింగిల్ గా ఉంటోంది. ఈ ముగ్గురు అమ్మాయిలను ఒక వ్యక్తి నిర్మానుష్య ప్రదేశంలో బంధిస్తాడు. వీళ్ళు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా, మళ్ళీ అతడు వేసిన ఉచ్చులోకి లాగబడుతుంటారు. అసలు వీళ్ళు అక్కడికి ఎలా వచ్చారో కూడా తెలీకుండా ఉంటుంది. వీళ్ళు అక్కడినుంచి బయటపడాలంటే ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది . ఇది ఒక భయంకరమైన ఆటలో భాగంగా ఉన్నట్లు తెలుసుకుంటారు.

ఈ ఆటను లూకాస్ అనే వ్యక్తి ఆడమని బలవంతం చేస్తాడు. ఇక అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఈ ముగ్గురు అమ్మాయిలు, ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి కూడా వస్తుంది. చివరికి ఆ సైకో నుంచి ఈ అమ్మాయిలు తప్పించుకుంటారా ? ఈ అమ్మాయిలనే సైకో ఎందుకు టార్గెట్ చేశాడు ? ఆ సైకో గతం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : మనుషుల్ని పీక్కుతినే కుక్కలతో సావాసం… అడ్వెంచర్ పేరుతో చావును కొని తెచ్చుకునే యూట్యూబర్లు

జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ వాచ్ (Just Watch) లో

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్లే టైమ్’ (Playtime). 2024 లో వచ్చిన ఫిలిప్పీన్ మూవీకి మార్క్ ఎ. రీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని GMA పిక్చర్స్, వివా ఫిల్మ్స్ కలసి నిర్మించాయి. 2024 జూన్ 12న ఫిలిప్పీన్స్‌ థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. ఇందులో సాన్యా లోపెజ్, కొలీన్ గార్సియా, ఫే లోరెంజో, జియాన్ లిమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక సైకో చుట్టూ తిరుగుతుంది. జస్ట్ వాచ్ (Just Watch) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×