E-Paper
Advertisement

OTT Movie : మగ జాతిని అంతం చేసే వైరస్… మిగిలిన ఒక్క అబ్బాయితో అమ్మాయిలంతా…

OTT Movie : మగ జాతిని అంతం చేసే వైరస్… మిగిలిన ఒక్క అబ్బాయితో అమ్మాయిలంతా…
Advertisement

OTT Movie : ఎప్పటినుంచో సినిమాలే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లకు వెళ్లకుండానే సినిమాలను ఇంట్లోనే చూస్తున్నారు. వీటితోపాటు వెబ్ సిరీస్ లు కూడా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్ స్టోరీలో భూమి మీద మగవాళ్ళు లేకుండా పోతే ఎలా ఉంటుందో చూపించారు. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

ముగ్గురు స్నేహితులు అలెక్స్, జైమీ, పిప్ న్యూజీలాండ్‌లోని హిరో వ్యాలీలో ఒక డైరీ ఫామ్‌లో జీవిస్తుంటారు. భూమి మీద ఒక వైరస్ దాదాపు పురుషులను నాశనం చేస్తుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత, స్త్రీలు మాత్రమే సమాజానికి దిశా నిర్దేశం చేస్తుంటారు. స్త్రీలు ఒక వెల్‌నెస్ అనే సంస్థను స్థాపించి, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు.ఈ సంస్థకు ఒక మహిళ నాయకురాలిగా ఉంటుంది. భూమి మీద మిగిలిపోయిన పురుషుల స్పెర్మ్ బ్యాంకుల నుండి స్పెర్మ్‌ను ఉపయోగించి లాటరీ ద్వారా జనాభాను పెంచే ప్రక్రియను నిర్వహిస్తారు.

ఒక రోజు రాత్రి ముగ్గురు అమ్మాయిలు కారులో ప్రయాణిస్తూ ఒక వ్యక్తిని ఢీకొంటారు. అతను ప్రపంచంలో మిగిలి ఉన్న చివరి పురుషుడిగా వీళ్ళంతా భావిస్తారు. ఈ సంఘటన వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఎందుకంటే బాబీ అక్కడ ఉన్న మహిళలకి ఓ రహస్యం చెప్తాడు. భూమి మీద ఇంకా పురుషులు జీవించి ఉన్నారని, వెల్‌నెస్ సంస్థ నిర్వహించే ఒక రహస్య ప్రయోగశాలలో బందీలుగా ఉన్నారని, నేను కూడా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని చెప్తాడు. వెల్‌నెస్ సంస్థ కూడా ప్రాణాలతో మిగిలిన పురుషులను బంధీలుగా ఉంచి, వారి స్పెర్మ్‌ను సేకరిస్తుంటారు. చివరికి ఈ అమ్మాయిలు బాబీని ఎలా వాడుకుంటారు ? అతన్ని వెల్‌నెస్ సంస్థకి అప్పగిస్తారా ? మరేదైనా ప్లాన్ చేస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : కార్లో ఉన్నంత సేపూ పగలే, కారు దిగితే మాత్రం నైట్… హర్రర్ మూవీ లవర్స్ కు ఫుల్ కిక్కిచ్చే మూవీ

 

మూడు ఓటిటిలలో స్ట్రీమింగ్

ఈ బ్లాక్ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘క్రీమెరీ’ (Creamerie). 2021 లో న్యూజీలాండ్ నుండి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ను లియాంగ్, JJ ఫాంగ్, పెర్లినా లా, అల్లీ జూ రూపొందించారు. ఈ సిరీస్ ఒక అపోకలిప్టిక్ ప్రపంచంలో జరుగుతుంది. ఇక్కడ ఒక వైరస్ 99% మంది పురుషులను చంపేసింది. మిగిలిన 1% న్యూజీలాండ్‌లోని ఒక రహస్య ప్రదేశంలో చనిపోయినట్లు తెలుస్తుంది. ఇది TVNZ OnDemand, jio hotstar, hulu ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2021లో మొదటి సీజన్ 6 ఎపిసోడ్‌లతో, 2023 లో రెండవ సీజన్ 6 ఎపిసోడ్‌లతో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. 2021 లో న్యూజీలాండ్ టెలివిజన్ అవార్డ్స్‌లో ఇది ఉత్తమ డ్రామా సిరీస్ అవార్డ్ ను గెలుచుకుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×