E-Paper
Advertisement

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ను మరిపించే డేంజరస్ సర్వైవల్ గేమ్… కాన్సెప్ట్ వేరు గానీ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ను మరిపించే డేంజరస్ సర్వైవల్ గేమ్… కాన్సెప్ట్ వేరు గానీ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్
Advertisement

OTT Movie : ఈ మధ్య గేమ్ ఆధారంగా సిరీస్ లు, సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఎప్పటి నుంచో ఇలాంటి స్టోరీలు వస్తున్నా, స్క్విడ్ గేమ్ ఎక్కువగా పాపులర్ అయింది. మూడు సీజన్ లతో వచ్చిన ఈ సిరీస్ ను, ప్రపంచ వ్యాప్తంగా ఆదరించారు. ఈ నేపథ్యంలో ఒక కొరియన్ సిరీస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠంగా సాగుతోంది. ఈ సిరీస్ కూడా ఒక గేమ్ ఆధారంగా సాగుతుంది. ఒక హైస్కూల్ అమ్మాయిలు ఎదుర్కొనే ఒక ప్రమాదకరమైన ఆటతో ఈ సిరీస్ నడుస్తుంది. ఊహించని ట్విస్ట్లు, వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఈ సిరీస్ హీట్ పుట్టిస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘పిరమిడ్ గేమ్’ (Phyramid game) 2024లో వచ్చిన కొరియన్ సైకలజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. పార్క్ సో-యోన్ దీనిని రూపొందించారు. ఇందులో బోనా, జాంగ్ డా-ఆ, ర్యూ డా-ఇన్, శిన్ సూ-కీ ప్రధాన పాత్రల్లో నటించారు. 10 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2024 ఫిబ్రవరీ 29 న TVINGలో విడుదల అయింది. పారామౌంట్ ప్లస్, Viuలో అంతర్జాతీయంగా అందుబాటులో ఉంది. IMDbలో దీనికి 7.5/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

సూ-జీ అనే అమ్మాయితో ఒక కొత్త స్కూల్‌లో స్టూడెంట్‌గా జాయిన్ అవుతుంది. ఆమె స్మార్ట్, అంతే కాకుండా ఒక మంచి అమ్మాయి కూడా. కానీ ఆ స్కూల్‌ లో ఒక వింత గేమ్ ఉంటుంది. దానిని పేరు ‘పైరమిడ్ గేమ్’. ఈ గేమ్‌లో స్టూడెంట్స్ ఒకరినొకరు ఓటు చేసి, ర్యాంక్ లు కూడా ఇచ్చుకుంటారు. ఎక్కువ ర్యాంక్ వచ్చినవాళ్లు స్కూల్‌లో పాపులర్ అవుతారు. తక్కువ ర్యాంక్ వచ్చినవాళ్లను అందరూ భాధపెడుతుంటారు. ఈ గేమ్ కూడా కొంచెం భయంకరంగానే ఉంటుంది. సూ-జీ మొదటి సారి ఓటింగ్‌లో ఫైల్ అవుతుంది. దీంతో క్లాస్‌లో అందరూ ఆమెను బాధపెడతారు. దీనిని ఆమె భరించలేక పోతుంది. ఇక సూ-జీ ఈ గేమ్‌ను ఆపాలని ఒక నిర్ణయానికి వస్తుంది.

Read Also : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

ఈ గేమ్‌ను క్లాస్ లీడర్ ఎరీ, ఆమె గ్యాంగ్ నడిపిస్తుంటారు. ఎరీ చాలా క్రూరమైన అమ్మాయి. తక్కువ ఓటింగ్ వచ్చిన వాళ్లను బాధపెట్టడానికి ఆమె ఈ గ్యాంగ్‌ను వాడుతుంటుంది. సూ-జీ వీళ్ళ దారుణాలకు బలైన అమ్మాయిలతో కలిసి, ఈ గేమ్‌ను సూ-జీ ఆపడానికి ప్లాన్ చేస్తుంది. ఇక ఈ కథ సస్పెన్స్, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ తో ముందుకు వెళ్తుంది. చివారికి ఆ గేమ్ ను సూ-జీ ఆపగలుగుతుందా ? ఎరీ, ఆమె గ్యాంగ్ తమ తప్పులను తెలుసుకుంటారా ? ఈ గ్యాంగ్ వల్ల సూ-జీ మరిన్ని ఇబ్బందులు పడుతుందా ? అనే విషయాలను, ఈ కొరియన్ సైకలజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×