// // Adventure Thriller OTT : అంతాన్ని ఆపడానికి డెమి గాడ్ ఆపసోపాలు -->
E-Paper
Advertisement

ప్రపంచం అంతాన్ని ఆపడానికి డెమి గాడ్ ఆపసోపాలు… మతిపోగోట్టే అడ్వెంచర్ డ్రామా

ప్రపంచం అంతాన్ని ఆపడానికి డెమి గాడ్ ఆపసోపాలు… మతిపోగోట్టే అడ్వెంచర్ డ్రామా
Advertisement

Adventure Thriller OTT : మనకు ఎలాంటి కష్టం వచ్చినా కళ్ళు మూసుకుని, ఆ కష్టాన్ని తీర్చమని దేవుడిని వేడుకుంటాము. ఆ పరిస్థితి మారే వరకూ దేవుడి మీదే భారం వేసి ఉంచుతాము. కానీ అలాంటి దేవుడికే కష్టం వస్తే ? ఆ పరిస్థితి నుంచి దేవుడు ఎలా గట్టెక్కాడు ? అన్న ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన ఒక అద్భుతమైన సిరీస్ ఈ రోజు మన మూవీ సజెషన్.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కింది Percy Jackson and the Olympians (2023). ఈ వెబ్ సిరీస్ రిక్ రియోర్డాన్ రాసిన ప్రసిద్ధ పుస్తకాల ఆధారంగా రూపొందింది. అంతేకాకుండా గ్రీకు పురాణాలను ఆధునిక కాలానికి ముడిపెడుతూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఈ సిరీస్ ప్రస్తుతం JIoHotstar, Airtel Xstream Play ఓటీటీలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ అయ్యాక గతంలో వచ్చిన సినిమాల కంటే ఈ సిరీస్ పుస్తకానికి చాలా దగ్గరగా ఉందని ప్రశంసలు కురిశాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండడంతో పాటు అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి ఆప్షన్ అవుతుంది. ప్రస్తుతం రెండవ సీజన్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కథలోకి వెళ్తే…

Advertisement

12 ఏళ్ల పిల్లాడు పర్సీ జాక్సన్ (వాకర్ స్కోబెల్) చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అతను చూడడానికి ఒక సాదాసీదా అబ్బాయిలా కనిపిస్తాడు. కానీ, అతనికి నీటిని కంట్రోల్ చేసే శక్తులు ఉంటాయి. ఈ క్రమంలోనే అతను గ్రీకు సముద్ర దేవుడైన పోసిడాన్ కుమారుడు అని తెలుస్తుంది. మరోవైపు ఒలింపస్ దేవుడైన జ్యూస్ దగ్గర ఉండే ‘మాస్టర్ బోల్ట్’ అనే పవర్ ఫుల్ ఆయుధం మిస్ అవుతుంది. దాన్ని దొంగిలించింది పర్సీయే అనుకుంటాడు జ్యూస్. తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి, ప్రపంచాన్ని దేవుళ్ల యుద్ధం నుండి కాపాడటానికి పర్సీ ఒక డేంజరస్ జర్నీని స్టార్ట్ చేస్తాడు.

also Read : జైలుకెళ్లి మరీ కిల్లర్లతో ఇంటర్వ్యూలు… సైకోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించే గూస్‌బంప్స్ సిరీస్

Advertisement

ఈ నేపథ్యంలోనే తన తల్లి అదృశ్యం అవుతుంది. దీంతో పర్సీ తనలాంటి శక్తులున్న పిల్లలు ఉండే ‘క్యాంప్ హాఫ్-బ్లడ్’కు వెళ్ళిపోతాడు. అక్కడ అథీనా కుమార్తె అన్నబెత్, తన రక్షకుడైన సాటర్ గ్రోవర్‌ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఈ ముగ్గురూ కలిసి భయంకరమైన రాక్షసులను అంతం చేస్తూ ఉంటారు. ఈ పోరాటంలో పర్సీ తన శక్తులపై పట్టు సాధిస్తాడు. అంతేకాదు తన తండ్రి పోసిడాన్‌ ను అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే అసలు హంతకుడు నరకంలో ఉన్న హేడిస్ కాదని, టైటాన్ రాజైన క్రోనోస్ ఈ కుట్ర వెనుక ఉన్నాడనే నిజం బయట పడుతుంది. మరి పర్సీ ప్రపంచాన్ని అంతం చేసే దేవుళ్ళ యుద్ధాన్ని ఎలా ఆపాడు ? క్రోనోస్ కుట్రను ఎలా బయట పెట్టాడు ? పర్సికి నమ్మకద్రోహం చేసింది ఎవరు ? అనేది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×