E-Paper
Advertisement

ఆత్మల కేసులు ఇన్వెస్టిగేట్ చేసే దెయ్యాలు… అదిరిపోయే ఫాంటసీ అడ్వంచర్ భయ్యా

ఆత్మల కేసులు ఇన్వెస్టిగేట్ చేసే దెయ్యాలు… అదిరిపోయే ఫాంటసీ అడ్వంచర్ భయ్యా
Advertisement

Horror Web Series OTT : ఒక కేసు మిస్టరీ ఎండ్‌ అవ్వగానే ఇంకో మిస్టరీ మొదలైతే ఎలా ఉంటుంది ? చనిపోయిన వాళ్లు కూడా కేసులు విచారిస్తే ఏం జరుగుతుంది ? జీవితం ముగిసిన తర్వాత కూడా నిజాన్ని వెతికే ప్రయాణం ఆగదంటే నమ్మగలమా ? ఇలాంటి భిన్నమైన కాన్సెప్ట్‌ తో ముందుకు సాగే కథే ‘డెడ్‌బాయ్‌ డిటెక్టవిస్‌’ (Dead Boy Detectives). ఇది నెక్ట్స్‌ లెవల్‌ సిరీస్‌ భయ్యా. జీవితం, మరణం మధ్యలో జరిగే విచిత్ర ఘటనలను విచారించే ఇద్దరు అబ్బాయిల కథ ఇది. మొదటి సీన్ నుంచే ఆసక్తిని కలిగించే విధంగా ఈ కథ సాగుతుంది.

ఎక్కడ చూడాలి ?

2024లో విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్. ప్రధానంగా యంగ్‌ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త కేసు చుట్టూ తిరుగుతూ, మొత్తం కథను ముందుకు తీసుకెళ్తుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్, విజువల్స్ ఈ సిరీస్‌ కు స్పెషల్ అట్రాక్షన్. సాధారణ క్రైమ్ కథలతో పోలిస్తే ఈ స్టోరీ చాలా భిన్నంగా ఉంటుంది

స్టోరీ ఏంటంటే ?

Advertisement

కథలో ఇద్దరు బాలురు చనిపోయిన తర్వాత కూడా ఈ లోకాన్ని విడిచి పెట్టకుండా ఉంటారు. వారు భూతాల్లా తిరుగుతూ, తమలాగే సమస్యల్లో చిక్కుకున్న ఆత్మలకు సహాయం చేస్తారు. ఈ క్రమంలో వారు డిటెక్టివ్‌ లుగా మారి, వివిధ మిస్టరీలను చేధించడానికి ప్రయత్నిస్తారు. ప్రతి కేసులో ఒక కొత్త సమస్య, కొత్త ప్రమాదం ఎదురవుతుంది. ఈ ఇద్దరూ ఒక అమ్మాయిని కలుస్తారు. ఆమె వారికి సహాయం చేస్తూ, జీవించి ఉన్న ప్రపంచంతో కనెక్షన్‌గా మారుతుంది. ఈ ముగ్గురు కలిసి వివిధ ఘటనలను విచారిస్తారు. ప్రతి కేసులో ఒక కొత్త రహస్యం బయట పడుతుంది. కొన్ని సీన్లు భయపెడతాయి.. ఇంకొన్ని సీన్లు భావోద్వేగంగా మనసును తాకుతాయి.

Also Read : వెంటాడి వేటాడే సైకో ఆత్మ… గుండె వేగం పెంచే మలుపులతో టైమ్ లూప్ హారర్

Advertisement

ఇలా స్టోరీ సాగుతుండగా ఒక పెద్ద మిస్టరీ బయట పడుతుంది. వారి గతం, వారి మరణం వెనుక ఉన్న నిజాలు బయటకు రావడం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో వారు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటారు. జీవితం, మరణం మధ్యలో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా మారుతుంది అనేది కథలో కీలకంగా మారుతుంది. మొత్తానికి ఇది సాధారణ డిటెక్టివ్ కథలా కాకుండా.. ఫాంటసీ, మిస్టరీ, భావోద్వేగం కలిసిన కథగా నిలుస్తుంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. చివరి వరకు మిస్టరీ కొనసాగించడం ఈ సిరీస్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. మీరు కూడా ఇలాంటి సిరీస్ నే వెతుకుతున్నా, ఇంకా ఈ సిరీస్ ను చూడకపోయినా వెంటనే ఒక లుక్కేయండి. దీనికి సంబంధించిన సీజన్ 2 రిలీజ్ పై అప్డేట్ రావాల్సి ఉంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×