E-Paper
Advertisement

మోహన్‌లాల్, మమ్ముట్టిల స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ‘పేట్రియాట్’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు

మోహన్‌లాల్, మమ్ముట్టిల స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ‘పేట్రియాట్’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు
Advertisement

Spy Action Thriller OTT : మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రస్తుతం ‘దృశ్యం 3’ చిత్రంతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మే 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన మరో మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. అయితే ఇందులో మలయాళం లెజెండరీ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి నటించడం విశేషం. ‘పేట్రియాట్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి నిర్మాతలే స్వయంగా ప్రకటించి, అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

తాజా అప్డేట్ ప్రకారం, ZEE5 ఓటీటీ ఈ సినిమా పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ స్పై-పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ను అందులో ప్రకటించారు. దక్షిణాది సినిమాకు చెందిన ఇద్దరు దిగ్గజ సూపర్‌స్టార్లు ఒక భీకర పోరాటంలో తలపడడం, అధికారం, రాజకీయాలు, ఇంకా అనేక పెద్ద సీక్రెట్స్ ఉన్న ‘పేట్రియాట్’ మూవీ జూన్ 5 నుండి ZEE5లో మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది అనేది దాని సారాంశం. కేవలం మలయాళంలోనే కాదు ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో కూడా రిలీజ్ అవుతుంది.

Advertisement

ఆంటో జోసెఫ్ – కేజీ అనిల్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, మమ్ముట్టిలతో పాటు ఫహద్ ఫాసిల్, నయనతార, రేవతి, దర్శన రాజేందర్, కుంచాకో బోబన్ వంటి స్టార్స్ నటించారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో బిగ్ స్క్రీన్ మీదకు వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సమాచారం ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలో 31.58 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో 43.25 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా 79.89 కోట్లు రాబట్టింది.

Also Read : పోచమ్మ విగ్రహాన్ని పొరపాటున పారేసే క్రిష్టియన్… కట్ చేస్తే కాటేరమ్మ జాతర

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సినిమా కథ సీక్రెట్ ఏజెంట్లు, ఓ నిఘా వ్యవస్థకు సంబంధించిన కుట్ర చుట్టూ నడుస్తుంది. కొంతమంది ఏజెంట్లు దేశానికి ముప్పుగా పరిణమించిన ఒక భారీ నిఘా నెట్‌వర్క్‌ను కనిపెడతారు. ఆ తర్వాత వాళ్ళు దానిని నాశనం చేయడానికి ఓ ప్లాన్ ప్రకారం ప్రయత్నిస్తారు. మరి అనుకున్నట్టే విలన్లను హీరోలు మట్టుబెట్టారా ? ఇందులో మోహన్ లాల్ – మమ్ముట్టి రోల్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×