E-Paper
Advertisement

రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. ‘పెద్ది’ రిలీజ్ ముందే బిగ్ ట్విస్ట్!

రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. ‘పెద్ది’ రిలీజ్ ముందే బిగ్ ట్విస్ట్!
Advertisement

Theatre Dispute: రెంటల్ vs పర్సంటేజ్ పంచాయితీ ఇపుడు ఏపీ ప్రభుత్వం వద్దకి చేరింది.అవును .. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్‌లోకి డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

పవన్ కళ్యాణ్‌ను కలిసి మద్దతు

Advertisement

ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ పద్ధతిలోనే వెళ్తామని మొండికేస్తుంటే, నిర్మాతలు మాత్రం పాత రెంటల్ విధానమే ముద్దంటున్నారు. ఈ గొడవ కాస్తా ముదిరి పాకాన పడటంతో ఇరు వర్గాలు ప్రెస్ మీట్లు పెట్టుకుని సవాల్ విసురుకునే వరకు వెళ్లింది. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సైతం ఫలించకపోవడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు రంగంలోకి దిగారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రెంటల్ విధానానికి మద్దతు తెలుపుతున్న పలువురు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి మద్దతు కోరడం పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.

Also read :ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న రజనీకాంత్ పాత బస్ కండక్టర్ ఐడీ కార్డ్!

Advertisement

ఇండస్ట్రీ మనుగడకు సంబంధించిన కీలక విషయాలు

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో ఉండటంతో, నిర్మాతలు వై. రవిశంకర్, కిలారు సతీష్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటిలతో కూడిన ఒక ప్రత్యేక బృందం అక్కడికే వెళ్లి ఆయనతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీ మనుగడకు సంబంధించిన కీలక విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారం కావడం, సింగిల్ స్క్రీన్స్ యజమానులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై పవన్‌కు వివరించారు. ఇండస్ట్రీని కాపాడుకోవడానికి విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నిర్మాతలు ఈ సందర్భంగా కోరారు.

జూన్ 4, 2026 న విడుదల కాబోతున్న ‘పెద్ది

అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక జూన్ 4, 2026 న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతున్న ‘పెద్ది’ సినిమా ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాను టార్గెట్ చేస్తూనే కొందరు కావాలనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉండి ఇప్పుడు హడావిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘పెద్ది’ సినిమాకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, తాము మాత్రం టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదంటూ ఎగ్జిబిటర్లు షాకింగ్ డెసిషన్ తీసుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. ఇప్పటికే ఈ సమస్యపై మెగాస్టార్ చి్రమజీవిని కూడా కలిసి ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఎగ్జిబిటర్ల పట్టు వీడకపోవడంతో నిర్మాతలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు.

Also read :బాబీ సినిమా మొదలైంది కానీ.. ‘విశ్వంభర’ అప్‌డేట్ ఎక్కడ? ఫైర్ అవుతున్న చిరు ఫ్యాన్స్

థియేటర్ల రగడ సర్దుమణుగుతుందా

నిర్మాతలు చెప్పిన సమస్యలను ఎంతో ఓపికగా విన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. టాలీవుడ్ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలను, సమస్యలను  పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆయన ఆదేశించారు.  జూన్ మొదటి వారంలోనే ‘పెద్ది’ వంటి భారీ చిత్రం థియేటర్లలోకి రావాల్సి ఉన్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ జోక్యంతోనైనా ఈ థియేటర్ల రగడ సర్దుమణుగుతుందా లేదా అనేది చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×