E-Paper
Advertisement

మనుషుల బ్రెయిన్ ను మటన్ లా తినేసే మాన్స్టర్స్… ఈ కొరియన్ సై-ఫై సిరీస్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ్యా

మనుషుల బ్రెయిన్ ను మటన్ లా తినేసే మాన్స్టర్స్… ఈ కొరియన్ సై-ఫై సిరీస్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ్యా
Advertisement

Sci Fi Horror Thriller : మనం మామూలుగా మటన్, చికెన్, ఫిష్ వంటివి తింటాము. క్రూరమైన జంతువులకు ఆకలేస్తే కంటికి కనిపించిన జంతువులను వేటాడి తింటాయి. మరి అదే మనుషుల్ని మటన్ లా తినే జంతువులు ఉంటే, మన బ్రెయిన్ చూడగానే వాటికి నోరు ఊరితే ఎలా ఉంటుంది ? ఆ ఊహే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదా. మరి అదే సిరీస్ రూపంలో వస్తే… అదే కొరియన్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ సిరీస్ ‘Parasyte: The Grey. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

భూమిపైకి వచ్చిన వింత గ్రహాంతర పరాన్నజీవుల చుట్టూ తిరుగుతుంది. ఆకాశం నుంచి లార్వా రూపంలో పడిన ఈ జీవులు మనుషుల మెదడులోకి చొరబడి, శరీరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఆ మనుషుల తలలు వికృత రూపాలు దాల్చి, చుట్టుపక్కల వారిని క్రూరంగా చంపి తినడం మొదలు పెడతాయి. ఇవి మనుషుల రూపంలోనే సమాజంలో కలిసిపోయి, నెమ్మదిగా మానవాళిని మొత్తం నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.

Advertisement

ఈ సిరీస్ లో మెయిన్ రోల్ జంగ్ సూ-ఇన్. ఆమె సూపర్ మార్కెట్ ఉద్యోగిగా పని చేస్తుంది. ఒక రాత్రి సైకోపాత్ ఆమెపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన సమయంలో, ఒక పారాసైట్ ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఆ సమయంలో సూ-ఇన్ శరీరం ఇప్పటికే తీవ్రంగా గాయపడటంతో, ఆ పారాసైట్ ఆమె మెదడును పూర్తిగా తినలేకపోతుంది. ఫలితంగా సూ-ఇన్ పూర్తి మనిషిగా కాకుండా, సగం మనిషి – సగం పారాసైట్ గా, మారిపోతుంది. ఆమె శరీరంలోని పారాసైట్‌కు ‘హైడి’ అని పేరు పెట్టుకుంటుంది.

హైడి రోజుకు కేవలం 15 నిమిషాలు మాత్రమే బయటకు వచ్చి ఆమెపై కంట్రోల్ తీసుకోగలదు. ఆ సమయంలో సూ-ఇన్ అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. ఈ హైబ్రిడ్ సూ-ఇన్‌ ను పట్టుకోవడానికి ప్రభుత్వం ‘ది గ్రే’ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ ను ఏర్పాటు చేస్తుంది. దీనికి హెడ్ చోయి జున్-క్యూంగ్. ఆమె భర్తను కూడా ఈ పారాసైట్లే చంపేయడంతో, ఆమెకు వ్యక్తిగత పగ కూడా ఉంటుంది. మరో వైపు తన చెల్లిని వెతుక్కుంటూ పారాసైట్ల ఉచ్చులో పడిన గ్యాంగ్‌స్టర్ సియోల్ కాంగ్-వూ, సూ-ఇన్‌కు సన్నిహితుడిగా మారతాడు.

Advertisement

హైడి బయటకు వచ్చినప్పుడు కాంగ్-వూ ఆమెను రక్షిస్తాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ పారాసైట్లు ఒక చర్చిని కేంద్రంగా చేసుకుని పెద్ద కుట్ర పన్నుతాయి. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులను, రాజకీయ నాయకులను తమ వశం చేసుకుని మానవాళిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. సూ-ఇన్‌ను తమ జాతికి మోసం చేస్తున్నదిగా భావించి ఆమెను చంపాలని చూస్తాయి. అటు ‘ది గ్రే’ టీమ్ కూడా ఆమెను ఒక పారాసైట్‌గానే చూసి వేటాడుతుంది. ఈ రెండు వైపులా నుంచి వచ్చే బెదిరింపుల మధ్య సూ-ఇన్, హైడి కలిసి ఎలా పోరాడతారు ? మానవులను, తమను తాము ఎలా కాపాడుకుంటారు ? క్లైమాక్స్ లో వచ్చే హైలెట్ సర్ప్రైజ్ ఏంటి ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

నెట్‌ఫ్లిక్స్‌లో 2024లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్‌తో. ‘ట్రెయిన్ టు బుసాన్’ దర్శకుడు యాన్ సాంగ్-హో తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రసిద్ధ జపనీస్ మంగా ఆధారంగా రూపొందింది. మొత్తం 6 ఎపిసోడ్‌లతో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులను స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేస్తుంది.

Read Also: ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×