E-Paper
Advertisement

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో ఆ ఆట ఆడే దెయ్యం… ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపదు, దబిడి దిబిడే

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో ఆ ఆట ఆడే దెయ్యం… ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపదు, దబిడి దిబిడే
Advertisement

OTT Movie : హారర్ జానర్ సినిమాలు ఇచ్చే కిక్ మాటల్లో చెప్పలేము. ఇందులో దెయ్యాలను చూపించినప్పుడు వచ్చే సౌండ్ ఎఫ్ఫెక్ట్ కి సగం ప్రాణాలు పోతుంటాయి. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు కళ్ళుమూసుకోవడం, గట్టిగా అరవడం వంటి పనులు చేస్తుంటారు. ఆతరువాత ఇలా ప్రవర్తించినందుకు నవ్వుకుంటుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా ఓజా బోర్డ్ తో మొదలవుతుంది. ఆతరువాత వచ్చే దెయ్యాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1988లో కేథరీన్ తన సోదరి క్లైర్, బాయ్‌ఫ్రెండ్ టోమస్ తో కలిసి ఒక ఇంట్లో ఓజా బోర్డ్‌తో గేమ్ ఆడుతుంది. ఈ ఇంటికి ఒక భయంకరమైన గతం ఉంటుంది. ఈ సమయంలో, వీళ్ళు అనుకోకుండా ఒక దుష్ట శక్తిని రప్పిస్తారు. దీనివల్ల క్లైర్, టోమస్ కనిపించకుండా అదృశ్యమవుతారు. కానీ కేథరీన్ తృటిలో తప్పించుకుంటుంది. 30 సంవత్సరాల తర్వాత, కేథరీన్ తన ఇంటిని కోల్పోయే ప్రమాదంలో ఉంటుంది. ఆమె కుమార్తె లారీ ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థి. పారానార్మల్ అంశాలపై ఒక పుస్తకం కోసం పరిశోధన చేస్తుంటుంది. ఈ పరిశోధనలో భాగంగా, లారీ తన బాయ్‌ఫ్రెండ్ నిక్, స్నేహితులు స్పెన్స్, టీనా, కజిన్ సమంతాతో కలిసి అదే భయంకరమైన ఇంటికి వెళ్తుంది. సమంతా ఆ ఇంటి గతం గురించి చెబుతుంది. ఇది రోకా అనే ఒక దుష్ట శక్తి తో సంబంధం కలిగి ఉందని, ఇది బలిదానాలను కోరుతుందని చెప్తుంది.

ఇంతలో లారీ ఆమె స్నేహితులు ఓజా బోర్డ్‌తో గేమ్ ఆడటం ప్రారంభిస్తారు. దీనివల్ల వీళ్ళు అనుకోకుండా రోకా అనే దుష్ట శక్తిని మళ్లీ రప్పిస్తారు. ఈ శక్తి ఇంటిని ఒక భారీ ఓజా బోర్డ్‌గా మార్చి, వారిని తన భయంకరమైన ఆటలో భాగం చేస్తుంది. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. లారీ ఒక పాత మాంత్రిక పుస్తకంలో రోకా గురించి తెలుసుకుంటుంది. అతను మంత్రగత్తెలచే ఒకప్పుడు ఈ ఇంట్లో బంధించబడ్డాడని, కానీ ఇప్పుడు అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అందులో ఉంటుంది. సమంతా, నిక్, టీనా ఒక్కొక్కరూ రోకా ఆటలో బలవుతారు. లారీ, స్పెన్స్ ఈ శక్తిని ఆపడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు ఆ దుష్ట శక్తిని అపుతారా ? దానికి బలవుతారా ? ఆ ఇంటి గతం ఏమిటి ? ఎందుకు ఓజా గేమ్ తో మనుషుల్ని బలి తీసుకుంటుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనిఉకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

అమెజాన్ ప్రైమ్‌లో

‘ఓజా హౌస్’ (Ouija House) బెన్ డెమరీ దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ చిత్రం. ఇది జస్టిన్ హాకిన్స్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీయబడింది. ఈ చిత్రంలో మిషా బార్టన్, తారా రీడ్, కార్లీ ష్రోడర్, డీ వాలెస్ నటించారు. ఇది 2018 మే 5న టెక్సాస్ ఫ్రైట్‌మేర్ వీకెండ్‌లో ప్రీమియర్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×