E-Paper
Advertisement

OTT Movie : కాలేజ్ లో కొడుకు బలి… ఆ తల్లి తీర్చుకునే రివేంజ్ రప్పా రప్పా… మస్ట్ వాచ్ బెంగాలీ సిరీస్

OTT Movie : కాలేజ్ లో కొడుకు బలి… ఆ తల్లి తీర్చుకునే రివేంజ్ రప్పా రప్పా… మస్ట్ వాచ్ బెంగాలీ సిరీస్
Advertisement

OTT Movie : ర్యాగింగ్ ప్రధాన అంశంగా తెరకెక్కిన ఒక బెంగాలీ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ జాదవ్‌పూర్ యూనివర్సిటీలో జరిగిన ఒక నిజ జీవిత ర్యాగింగ్ సంఘటన ఆధారంగా రూపొందింది. ఇది ర్యాగింగ్ భూతానికి బలైన ఒక కొడుకు కోసం, ఒక తల్లి రివేంజ్ తీర్చుకునే థ్రిల్లింగ్ కథ. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బిజోయా నైహాటిలో నివసించే ఒక వితంతువు. తన ఏకైక కొడుకు నీలాంజన్ తో జీవిస్తుంటుంది. నీలాంజన్ టాలెంట్ ఉన్న ఒక విద్యార్థి. కోల్‌కతాలోని ఒక పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరతాడు. ఇది బిజోయాకు చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఒక రోజు ఆమెకు షాకింగ్ వార్త వస్తుంది. నీలాంజన్ కాలేజ్ హాస్టల్ ఐదవ అంతస్తు నుండి పడి కోమాలోకి వెళ్తాడు. అధికారులు దీనిని ఆత్మహత్య ప్రయత్నంగా చెప్పినప్పటికీ, బిజోయా తన కొడుకు ఆత్మహత్య చేసుకోడని గట్టిగా నమ్ముతుంది. ఆమె నీలాంజన్ జీవితం కోసం ఆసుపత్రిలో పోరాడుతూనే, కొడుకు ఈ స్థితికి కారణం ఒక ర్యాగింగ్ ఘటన కారణమని తెలుసుకుంటుంది. వాళ్ళను శిక్షించాలనుకుంటుంది. ఈ పోరాటంలో ఆమెకు ఒక జర్నలిస్ట్ పూర్బా బెనర్జీ సహాయం అందిస్తాడు.

బిజోయా తన కొడుకు కోసం, న్యాయం కోసం పోరాడుతూ, శక్తివంతమైన వ్యక్తులైన సీనియర్ విద్యార్థి రికీ, అతని తండ్రి మిహిర్ గుప్తాను ఢీకొంటుంది. కళాశాల యాజమాన్యం, పోలీసులు ఈ సంఘటనను దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ బిజోయా వెనక్కి తగ్గదు. నీలాంజన్ రూమ్‌మేట్ ఆహన్ మైత్రా సహాయంతో, ఆమె ర్యాగింగ్ దారుణమైన వివరాలను, ఒక అవినీతి నెట్‌వర్క్‌ను బయటపెడుతుంది. ఆమెను చంపుతామని బెదిరింపులకు గురిచేస్తారు. ఈ పరిస్థితిలో బిజోయా తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందా ? వాళ్ళను శిక్షిస్తుందా ? ర్యాగింగ్ కు కారణం ఏమిటి ? ఒక మహిళ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటుంది ? అనే వివరాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ బెంగాలీ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Advertisement

మూడు ఓటీటీలలో

‘బిజోయా’ (Bijoya) సాయంతన్ ఘోసల్ దర్శకత్వంలో రూపొందిన బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది హోయ్‌చోయ్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో 2024 జూలై 5న విడుదలైంది. ఈ సిరీస్‌లో స్వస్తికా ముఖర్జీ, దేబ్దుత్తా రహా, షాహెబ్ చటోపాధ్యాయ్, బిదిప్తా చక్రబర్తీ, రౌనక్ దే భౌమిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ హోయ్‌చోయ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×