E-Paper
Advertisement

OTT Movies : ఈ ఫ్రైడే ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ క్రైమ్ థ్రిల్లర్స్… ఈ 5 అస్సలు మిస్సవ్వొద్దు

OTT Movies : ఈ ఫ్రైడే ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ క్రైమ్ థ్రిల్లర్స్… ఈ 5 అస్సలు మిస్సవ్వొద్దు
Advertisement

OTT Movies : ప్రతి శుక్రవారం ఓటీటీ ప్రియులకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజే కదా వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతాయి. ఈ శుక్రవారం కూడా పెద్ద ఎత్తున మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. డిసెంబర్ 19న క్రైమ్ థ్రిల్లర్‌ల నుండి ఉత్కంఠభరితమైన పోలీస్ డ్రామాలు, రొమాంటిక్ కామెడీల వరకు సినిమాలు, సిరీస్‌లను విడుదల చేస్తున్నాయి ఓటీటీలు, ఈ శీతాకాలంలో ఇంట్లో సరదాగా వీకెండ్ ను గడపడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ (Raat Akeli Hai 2)

నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, చిత్రాంగద సింగ్ నటించిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్’. కాన్పూర్‌లోని విలాసవంతమైన బంగ్లాలో జరిగే మిస్టీరియస్ బన్సాల్ కుటుంబం దారుణమైన సామూహిక హత్య, దాన్ని దర్యాప్తు చేసే ఇన్‌స్పెక్టర్ జతిల్ యాదవ్ చుట్టూ దీని కథ తిరుగుతుంది. డిసెంబర్ 19 నుండి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ థ్రిల్లర్‌ను చూడండి.

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 (four more shots please season 4)

Advertisement

‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ నాల్గవ, చివరి సీజన్లో సిద్ధి, దామిని, అంజనా, ఉమాంగ్ అనే నలుగురు అమ్మాయిల రచ్చ కంటిన్యూ కాబోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ-డ్రామాలో సయాని గుప్తా, కీర్తి కుల్హారి, బని జె, మాన్వి గగ్రూ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 19 నుండి ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ప్రసారం కానుంది ఈ సిరీస్.

నయనం (Nayanam)

ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ లలో ‘నయనం’ కూడా ఒకటి. ఈ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో కంటి క్లినిక్ నడుపుతూ, భయాంకరమైన ప్రయోగాలు చేసే ఐ డాక్టర్ స్టోరీ. ఈ శుక్రవారం ZEE5లో దీన్ని చూడవచ్చు.

మిసెస్ దేశ్‌పాండే (mrs deshpande)

Advertisement

25 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ కథ ఇది. పోలీసులు ఆమెను సంప్రదించి, ఆమె అదే పద్ధతిలో హత్యలు చేస్తున్న కొత్త హంతకుడిని పట్టుకోవడంలో సహాయం కోరతారు. ఈ సిరీస్ ఫ్రెంచ్ సిరీస్ “లా మోంటే” నుండి ప్రేరణ పొందింది. డిసెంబర్ 19 నుండి జియో హాట్‌స్టార్‌ (JioHotstar)లో దీన్ని చూడొచ్చు.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (Dominic and the Ladies Purse)

ప్రైవేట్ డిటెక్టివ్‌గా మారిన మాజీ పోలీసు అధికారి పోగొట్టుకున్న పర్స్ యజమానిని కనుగొనే క్రమంలో ఓ సీరియల్ కు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ మలయాళ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. దీనిని డిసెంబర్ 19 నుండి ZEE5లో ప్రసారం చేయనున్నారు. వీటితో పాటు ది గ్రేట్ ఫ్లడ్ అనే కొరియన్ థ్రిల్లర్, హ్యూమన్ స్పెసిమెన్స్ అనే జపనీస్ సైకలాజికల్ థ్రిల్లర్ కూడా రిలీజ్ కాబోతున్నాయి.

Read Also : ఆస్కార్ కి షార్ట్‌లిస్ట్ అయిన ‘హోమ్‌బౌండ్’ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×