E-Paper
Advertisement

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీకెండ్ థ్రిల్లర్ ల నుంచి, ఫ్యామిలీ డ్రామాల వరకు ఇవి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాయి. వీటిని ఎక్కడ చూడచ్చో తెలుసుకుందాం పదండి.

కెన్నెడీ (Kennedy)

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ 2026 ఫిబ్రవరి 20 నుండి ZEE5 లో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చింది.

హాట్‌ స్పాట్ 2 మచ్ (Hot Spot 2 Much)

Advertisement

విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ సోషల్ ఆంథాలజీ చిత్రం ఫిబ్రవరి 20, 2026 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒకేసారి Amazon Prime Video, Aha, Lionsgate Play, Simply South, Shortflix, మరియు AP International South Cinema వంటి 6 ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. రెండేళ్ల కిందట వచ్చిన ‘హాట్ స్పాట్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా తెలుగు వెర్షన్ లేదు, తమిళం, హిందీ ఆడియోలలోనే అందుబాటులోకి వచ్చింది.

అమోజ్ అలెగ్జాండర్ (Amos Alexander)

అజు వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 2026 ఫిబ్రవరి 20 నుండి Sun NXT లో అందుబాటులోకి వచ్చింది.

3 రోజెస్ సీజన్ 2 (3 Roses Season 2) 

Advertisement

ఈ పాపులర్ తెలుగు వెబ్ సిరీస్ రెండో సీజన్ 2025 డిసెంబర్ 12 న Aha తమిళంలో విడుదలైంది. ఈ సీజన్‌లో ఈషా రెబ్బా, కుషితా కల్లపు, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈషా (Eesha) 

థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక దెయ్యాల బంగ్లా లోకి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది.

నే జా 2 (Ne Zha 2) 

ఇది జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్ల యానిమేషన్ మూవీ ఇది.  ఈ సినిమా ఇరవై వేల కోట్లకు పైగా వసూలు చేసింది. మాండరిన్, ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

రాక్షస వెబ్ సిరీస్ (Rakshasa Web Series) 

ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలోకి వచ్చింది. ఇందులో ఒక నదిలో మనుషులు చనిపోతుంటారు. వాళ్ళని మొసలి చంపుతుందా ? సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా ? అనే ఇన్వెస్టిగేషన్ తో కథ ఉంటుంది.

Read Also : కూతురి మిస్సింగ్ తో అడవిలో హడలెత్తిపోయే అడ్వెంచర్… ఓటీటీలోకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×