E-Paper
Advertisement

OTT Movie : రిమోట్ ఐలాండ్లో అమ్మాయిల అరాచకం… బ్లాక్ మ్యాజిక్ తో ఒళ్లు గగుర్పొడిచే ఎలిమెంట్స్… హర్రర్ మూవీ కంటే ఘోరం

OTT Movie : రిమోట్ ఐలాండ్లో అమ్మాయిల అరాచకం… బ్లాక్ మ్యాజిక్ తో ఒళ్లు గగుర్పొడిచే ఎలిమెంట్స్… హర్రర్ మూవీ కంటే ఘోరం
Advertisement

OTT Movie : హర్రర్ సినిమాలకు ఉండే క్రేజే వేరప్పా. ఊహించని టర్న్స్ తో, ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో ఎంత భయంకరమైన సినిమా అయినా సరే చూడాలనిపిస్తుంది. మరీ గుండె గుభేల్మనిపించే సీన్లు ఉంటే దుప్పటి కప్పుకుని అయినా చూస్తారు తప్పితే స్కిప్ చేయరు. అలాంటి క్రేజీ హార్రర్ మూవీ లవర్స్ కోసమే 2025 లో వచ్చిన ఈ బెస్ట్ హర్రర్ మూవీ. ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేసి ఎంజాయ్ పండగో.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 2025 బెస్ట్ హర్రర్ మూవీ పేరు ‘హోస్ట్’ (Host). 2025లో విడుదలైన థాయ్ సూపర్‌ నాచురల్ హారర్ మూవీ ఇది. కొత్తగా పుట్టిన పిల్లలను కాపాడే థాయ్ గార్డియన్ స్పిరిట్ ను మొదటిసారిగా స్క్రీన్‌పై ఈ సినిమా ద్వారా చూపించారు. డైరెక్టర్ పోక్‌పాంగ్-పైరాచ్ ఖుమ్‌వాన్ (Pairach Khumwan) తీసిన ఈ మూవీ Amazon Prime Video ఒరిజినల్ గా 2025 అక్టోబర్ 23న గ్లోబల్‌గా ప్రీమియర్ అయింది. 2 గంటల 5 నిమిషాలు ఉన్న ఈ సూపర్‌ నాచురల్ థ్రిల్లర్ డ్రామా ఎమోషనల్‌గా హాంటింగ్ గా ఉంటుంది. థాయ్ హారర్‌ జానర్లో ఇదొక ఫ్రెష్ ఎంట్రీ అని విమర్శకులచే ప్రశంసలు అందుకున్న మూవీ ఇది. థాయ్ హర్రర్ మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.

Advertisement

Read Also :  ప్రియురాలి ఉచ్చులో ప్రియుడు బలి… మర్డర్ కేసులో అడ్డంగా బుక్… ఓటిటిలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్

కథలోకి వెళ్తే…

దూరంగా ఉన్న ఒక ద్వీపంలోని ఆల్-గర్ల్స్ రిఫార్మ్ స్కూల్ కు ఇంగ్ అనే యువతిని పంపుతారు. అక్కడ ఒక్కటే రూల్. విధేయతతో మెలగాలి. స్కూల్ స్ట్రిక్ట్ ఉంటుంది. మదర్ (హెడ్), స్టూడెంట్ లీడర్ ఐమ్ స్కూల్ ను చూసుకుంటారు. ఇంగ్ వచ్చాక విచిత్రమైన, భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. థాయ్ పురాణాలలోని మే స్యూ స్పిరిట్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. సాధారణంగా పిల్లలను కాపాడే గార్డియన్, కానీ ఇక్కడ భయంకరమైన టర్న్ తీసుకుంటుంది ఆ స్పిరిట్. నిజానికి ఇంగ్ గతంలోని ఒక ట్రాజెడీ వల్ల రిఫార్మ్ స్కూల్‌కు వెళ్తుంది. ఐమ్ స్టూడెంట్స్‌ను వేధిస్తూ, డామినేట్ చేస్తుంది. ఇంగ్ వచ్చాక ఆమెను అలాగే చేస్తారు. ఆమె యాసను వెక్కిరించడం వంటివి చేసి ఏడిపిస్తూ ఉంటారు. బోట్ డ్రైవర్ పిన్ ఇంగ్‌తో ఫ్రెండ్‌షిప్ ఏర్పరుచుకుంటాడు. ఇది ఐమ్‌కు జెలసీ కలిగిస్తుంది. ఈ క్రమంలోనే స్కూల్‌లో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆమెను ఏడిపించిన వారు ఘోరంగా చనిపోతారు. మదర్ ప్రిస్సానా ముఖంపై గాయాలతో చనిపోతుంది. తరువాత ఇంగ్ సూసైడ్ చేసుకుంటుంది. మరి ఇంగ్ చావుకు కారణం ఎవరు? ఆ స్కూల్ లో జరిగిన భయంకరమైన చావులకు కారణం ఎవరు అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×