E-Paper
Advertisement

OTT Movie : హార్ట్‌బీట్ మ్యాచ్ అయ్యే అమ్మాయితో పెళ్లి… పెళ్లయ్యాక మరో అమ్మాయితో ఆ పాడుపని

OTT Movie : హార్ట్‌బీట్ మ్యాచ్ అయ్యే అమ్మాయితో పెళ్లి… పెళ్లయ్యాక మరో అమ్మాయితో ఆ పాడుపని
Advertisement

OTT Movie : ఫ్యామిలీతో కూర్చుని చూసే ఒక కన్నడ ఫీల్ గుడ్ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రేమ జంటలకి కూడా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఇది ఒక మ్యూజిక్ కంపోజర్ తన హార్ట్‌బీట్ మ్యాచ్ అయ్యే అమ్మాయిని వెతికే ఒక  సింపుల్ లవ్ స్టోరీ. కన్నడలో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ఒండు సరళ ప్రేమ కథ’ 2024లో విడుదలైన కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం. సునీల్ కుమార్ డైరెక్షన్ లో మైసూర్ రమేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. ఇందులో వినయ్ రాజ్‌కుమార్, మల్లికా సింగ్, స్వాథిష్ట కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024కి ఫిబ్రవరి 9న  విడుదలై, పాజిటివ్ రివ్యూస్ సాధించి 25 రోజులు థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అయింది. ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొంది, ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అతిషయ్ బెంగళూరులో ఉండే ఒక మ్యూజిక్ కంపోజర్. ఇంకా బ్రేక్ రాలేదు, స్టూడియోలు తిరుగుతూ ఉంటాడు. అతను తన హార్ట్‌బీట్ ని టచ్ చేసే అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయిపోయాడు. అదే టైమ్‌లో అనురాగ అనే టీవీ జర్నలిస్ట్ సెల్ఫ్‌లెస్ మనిషి లైఫ్ లోకి రావాలని అనుకుంటుంది. అలాంటి వ్యక్తి ఎవడూ దొరక్కపోతే ఒంటరిగానే ఉంటానని ఫిక్స్ అయిపోయింది. ఇద్దరి ఫ్యామిలీలు పెళ్లి సంబంధం తెచ్చి వీళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ జరిపిస్తాయి. వీళ్ళు కూడా తప్పక చేసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇద్దరూ ఒకరినొకరు లవ్ చేయరు. ఒకరికొకరు నీవు నా టైప్ కాదు అని ఓపెన్‌గానే చెప్పేసుకుంటారు. ఇద్దరూ వేరే వేరే రూమ్స్‌లో ఉంటారు. ఫ్రెండ్స్ లాగా మాత్రమే మాట్లాడుకుంటారు.

ఒక రోజు అతిషయ్ మ్యూజిక్ కెరీర్ కోసం ఒక పెద్ద ఆల్బమ్ చాన్స్ కోసం హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ ఒక రోడ్ ట్రిప్‌లో మధుర అనే అమ్మాయిని కలుస్తాడు. మధుర వాయిస్ వినగానే అతిషయ్ షాక్ అవుతాడు. అది తన హార్ట్‌బీట్ రిథమ్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. తన ఆల్బమ్‌లోని ఒక సాంగ్‌కి మధుర వాయిస్ ఫిక్స్ అవుతుంది. ఇద్దరూ కలిసి రికార్డింగ్ కూడా చేస్తారు. రోడ్ ట్రిప్‌లో బాగా క్లోజ్ అవుతారు. అతిషయ్‌కి మధుర మీద ఫీలింగ్స్ వస్తాయి… కానీ పెళ్లైపోయిన విషయం దాచేస్తాడు.

Advertisement

Read Also : ఏడు ఆస్కార్లు గెలిచిన రియల్ స్టోరీ… హిట్లర్ దాష్టీకం నుంచి 1100 మందిని బతికించిన హీరో… ఇప్పటికీ టాప్ 10లో చోటు

ఇంట్లో అను ఒక్కటే ఉంటూ ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఆమెకి తెలియకుండానే అతిషయ్ మీద గౌరవం, అఫెక్షన్ పెరుగుతుంది. అతిషయ్ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక నీకు నేను ఇష్టమే కదా? అని అడుగుతుంది. ఇప్పుడు అతిషయ్ గందరగోళంలో పడతాడు. ఒకవైపు హార్ట్‌బీట్ మ్యాచ్ అయిన మధుర, మరోవైపు పెళ్లి చేసుకున్న అను.. ఎవరో ఒకర్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? అతిషయ్ ఎవరిని ఎంచుకుంటాడు ? ఈ సమస్య ఎలా తీరుతుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×