E-Paper
Advertisement

Ram Charan theatres : అల్లు అర్జున్ కి పోటీగా రామ్ చరణ్ థియేటర్స్, ఎగ్జిబిటర్లు దుకాణం సర్దుకోవాల్సిందేనా?

Ram Charan theatres : అల్లు అర్జున్ కి పోటీగా రామ్ చరణ్ థియేటర్స్, ఎగ్జిబిటర్లు దుకాణం సర్దుకోవాల్సిందేనా?
Advertisement

Ram Charan theatres : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాకుండా మరోవైపు వ్యాపార రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. కొంతమంది ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్స్ స్థాపిస్తారు. ఇంకొంతమంది మాత్రం తమ పేరు మీద సినిమా థియేటర్స్ కట్టడం మొదలుపెట్టారు.

ఏసియన్ సినిమా గ్రూప్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏషియన్ మహేష్ బాబు సినిమా థియేటర్ శరత్ సిటీ మాల్ లో ఎలా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది దానిని శరత్ సిటీ మాల్ అనకుండా ఏఎంబి థియేటర్స్ అని మాత్రమే పిలుస్తారు. అలానే మరోవైపు వనస్థలిపురంలో ఏఆర్టి కూడా స్థాపించారు ఏషియన్ రవితేజ.

Advertisement

అలానే ఏవిడి అనే థియేటర్ కూడా ఉన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏషియన్ విజయ్ దేవరకొండ థియేటర్స్ కూడా బాగా పాపులర్. అలానే అల్లు అర్జున్ పేరు మీద కూడా చాలా థియేటర్లు ఉన్నాయి ఏషియన్ అల్లు అర్జున్ అమీర్పేటలో బాగా పాపులర్. చాలా సినిమా ఫంక్షన్లు అన్నీ కూడా అక్కడే ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మీడియాకు సంబంధించి సినిమాలు కూడా అక్కడే ఎక్కువగా వేస్తున్నారు.

అల్లు అర్జున్ కు పోటీగా రామ్ చరణ్ థియేటర్స్ 

మరోవైపు రాంచరణ్ కూడా థియేటర్స్ నిర్మించనున్నారు. ఏసియన్ రామ్ చరణ్ పేరు మీద కొన్ని థియేటర్స్ స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు సినిమా హీరోలందరూ కూడా వాళ్ళ పేర్ల మీద థియేటర్లు కట్టుకుంటున్నారు. ఇక హీరోలందరూ థియేటర్లు కట్టుకుంటే ఎగ్జిబిటర్ల పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

Advertisement

హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా తమ సత్తా ఏంటో చూపించాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లున్నారు. ఇలా ఎవరి పేరు మీద వాళ్ళకి థియేటర్లు ఉండటం వలన వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది.

అయితే దీనివలన చాలామంది ఎగ్జిబిటర్లకి భారీ స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం తగ్గించేశారు. ఈ పరిస్థితుల్లో మల్టీప్లెక్స్ సినిమాలు పెరిగిపోతూ ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మొత్తానికి రామ్ చరణ్ థియేటర్ బిజినెస్ లోకి రాలేదు అనుకుంటున్న తరుణంలో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు ఎంటర్టైన్మెంట్స్ సెపరేట్ 

ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్స్ మాత్రమే కాకుండా సపరేట్గా అల్లు అర్జున్ కూడా థియేటర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం గట్టిగా వినిపిస్తుంది. అల్లు ఎంటర్టైన్మెంట్ పేరు మీద ఈ థియేటర్ కోకాపేట్ లో నడపబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలో ఈ థియేటర్ కి సంబంధించిన కంప్లీట్ ఫోటోలు మరియు డీటెయిల్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: The Goat Movie: హీరో సుధీర్‌పై కేసు పెట్టాం.. గోట్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×