E-Paper
Advertisement

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం
Advertisement

OTT Movie : తెలంగాణలోని ఓదెల గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్‌’. వరుస హత్యలతో తిరిగే ఈ కథ క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా ఉంటుంది. నవ వధువులపై అఘాయిత్యాలు, హత్యలతో ఆ ప్రాంతం అట్టుడికిపోతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తో మొదలయ్యే ట్విస్ట్లు ఆడియన్స్ కి చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తాయి. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా నటించిన ఈ సినిమా షూటింగ్ నిజమైన ఓదెల రైల్వే స్టేషన్‌లోనే జరిగింది. పార్ట్ 2 కూడా ఈ ఏడాది వచ్చి హల్చల్ చేసింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

‘ఓదెల రైల్వేస్టేషన్‌’ (Odela Railway Station) 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె. కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్‌తేజ దర్శకత్వం వహించగా, సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

తెలంగాణలోని ఓదెల గ్రామం చాలా చిన్నది. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడికి అనుదీప్ అనే ట్రైనీ ఐపీఎస్‌ ఓదెల ఊరికి ట్రైనింగ్ కోసం వస్తాడు. అక్కడి పోలీస్ స్టేషన్‌లో మూడు నెలల పాటు ట్రైనింగ్ కోసం వస్తాడు. అయితే ఈ సమయంలో ఊరిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఊర్లో పెళ్లి జరిగిన తరువాత, శోభనం అయిన తరువాత పెళ్లి కూతురిని కిడ్నాప్ చేస్తుంటాడు. ఇక శోభనం ఎలా జరిగిందని అడుగుతూ ఆమె మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తుంటాడు. ఆ సైకోను పట్టుకునేందుకు అనుదీప్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ సైకో చాలా తెలివిగా తప్పించుకుంటాడు.

Read Also : పొలిటీషియన్ అవతారమెత్తే గ్యాంగ్స్టర్… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… ఖతర్నాక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

మరో వైపు ఆ ఊర్లోని రాధ (హెబ్బా పటేల్) ఆమె మొగుడు తిరుపతి (వశిష్ట సింహా) ఇప్పుడు కథలోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళకి అనుకోకుండా పెళ్లి జరుగుతుంది. ఇక ఈ హత్యల్లో అసలు కిల్లర్ ని ఒక రోజు రాధ గుర్తిస్తుంది. పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూసి ఒక్క సారిగా ఆమె షాక్ అవుతుంది. కిల్లర్ కూడా ఆమెను చూస్తాడు. ఆ తరువాత ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఆ భయంకరమైన సంఘటన ఏంటి ? కిల్లర్ ఎవరు ? ఎందుకు పెళ్ళయిన అమ్మాయిలను చంపుతున్నాడు ? రాధ కిల్లర్ ని ఎలా ఎదుర్కొంటుంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×