E-Paper
Advertisement

నెట్ ఫ్లిక్స్ లో దాగి ఉన్న హిడెన్ జెమ్స్ ఈ విజువల్ వండర్స్… ఒక్కటన్నా చూశారా ?

నెట్ ఫ్లిక్స్ లో దాగి ఉన్న హిడెన్ జెమ్స్ ఈ విజువల్ వండర్స్… ఒక్కటన్నా చూశారా ?
Advertisement

Netflix : ఓటీటీలలో లెక్కలేనన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు పదుల సంఖ్యలో కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. అందుకే కొత్తగా వచ్చిన సినిమాల గురించే వెతుకుతూ ఉంటాము. కానీ ఈరోజు మనం నెట్ ఫ్లిక్స్ లో దాగి ఉన్న హిడెన్ జెమ్ లాంటి అద్భుతమైన సినిమాల గురించి తెలుసుకుందాం.

బిగ్ ఫిష్

Advertisement

ఫాంటసీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన మూవీ ‘బిగ్ ఫిష్’. విజువల్ వండర్ మాత్రమే కాదు మ్యాజికల్ రియలిజం దీనిని చూస్తున్న ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రంలో ఊహ, భావోద్వేగాలతో నిండిన ప్రపంచాన్ని చూడవచ్చు. ఒక్కసారి చూశారంటే ఈ మూవీ చాలా కాలం గుర్తుండిపోతుంది.

Also Read : పందెం కోడి చుట్టూ పరుగులు పెట్టే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా

Advertisement

మిస్టర్ బీన్స్ హాలిడే

పెద్దగా ట్విస్టులు, టెన్షన్లు లేకుండా కామెడిగా ఉండే సినిమా కోసం చూస్తున్నారా ? అయితే ‘మిస్టర్ బీన్స్ హాలిడే’ బెస్ట్ ఆప్షన్. ఫ్రాన్స్‌లోని కలర్ ఫుల్ వీధులు, సముద్ర తీరాలు, రమణీయమైన గ్రామీణ ప్రాంతాలు ఈ సినిమాలో విజువల్ గా హైలెట్ అవుతాయి. మిస్టర్ బీన్ చేసే అమాయకమైన హాస్యం సినిమాను చూస్తున్నంతసేపూ ముఖంపై చిరునవ్వు ఉండేలా చేస్తుంది.

పర్ఫెక్ట్ డేస్

టోక్యో నగరపు సౌందర్యాన్ని ప్రశాంతమైన రీతిలో ఆవిష్కరిస్తూ, మనసుకు హాయినిచ్చే అనుభూతిని కలిగించే సినిమా ఇది. ఈ చిత్రం మినిమలిస్ట్ దృశ్య శైలి, ప్రశాంతమైన కథనం మనల్ని మెంటల్ గా సేదతీరేలా చేస్తుంది.

స్టార్‌డస్ట్

ఫాంటసీ – రొమాన్స్‌ కలగలిసిన అద్భుతమైన చిత్రం ‘స్టార్ డస్ట్’. మాయా రాజ్యం, మెరిసే ఆకాశం, అద్భుత కథల తరహా సీన్స్ ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రం సాహస – రొమాన్స్ ప్రియులు ఇద్దరినీ ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం.

Also Read : రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఓటీటీ నుంచి అవుట్… పట్టపగలే చూసినా ప్యాంటు తడవాల్సిందే

ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి

విజువల్స్ పరంగా మనసుకు హాయినిచ్చే సినిమాల లిస్ట్ లో ‘ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి’ అగ్రస్థానంలో ఉంటుంది. వాల్టర్ మిట్టి సాధారణ జీవితం నుండి అసాధారణ సాహసయాత్ర వరకు సాగిన ప్రయాణాన్ని ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, హిమాలయాల వంటి ఉత్కంఠభరితమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ ఒక పోస్ట్‌కార్డ్ అంత అందంగా ఉంటుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×