E-Paper
Advertisement

ట్రూ హర్రర్ మూవీ లవర్సా… ఈ ఇండోనేషియన్ సూపర్ నేచురల్ మూవీస్ ను డోంట్ మిస్

ట్రూ హర్రర్ మూవీ లవర్సా… ఈ ఇండోనేషియన్ సూపర్ నేచురల్ మూవీస్ ను డోంట్ మిస్
Advertisement

Horror Movies on OTT : హర్రర్ మూవీ లవర్స్ కోసం ఈరోజు అదిరిపోయే ట్రీట్ లాంటి సినిమాలను పట్టుకొచ్చేశాం. ఎంతటి ధైర్యవంతులైనా ఈ సినిమాలను ఒంటరిగా చూస్తే పక్క తడిపేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఇవేమీ సాదాసీదా హారర్ మూవీస్ కాదు. మోస్ట్ స్కేరీయెస్ట్ ఇండొనేషియన్ హర్రర్ సినిమాలు ఇవి. కాబట్టి సింగిల్ గా చూసే ధైర్యం చేయకండి.

Satan’s Slaves (2017)

Advertisement

దర్శకుడు జోకో అన్వర్ రూపొందించిన క్లాసిక్ హారర్ సినిమా ‘సాతాన్స్ స్లేవ్స్’. సినిమాలో ఓ పేద కుటుంబం ఉంటుంది. వాళ్ళ తల్లి భయంకరమైన వింత వ్యాధితో మంచాన పడుతుంది. ఆ రోగం తగ్గక చివరికి చనిపోతుంది. ఆమె చనిపోయింది మొదలు ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆమె దయ్యం రూపంలో తిరుగుతూ పిల్లలను భయపెడుతుంది. కానీ ఆ తరువాత పిల్లలకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది: గతంలో ఆ తల్లి పిల్లల కోసం భయంకరమైన సాతాను ముఠాతో ఒప్పందం చేసుకుందని తెలుసుకుని షాక్ అవుతారు. ఆ డీల్ ఫలితం ఏంటి ? చివరికి ఆ ఇంట్లో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు ? అనేది కథ.

Impetigore (2019)

Advertisement

మాయ అనే అమ్మాయి ఫినాన్షియల్ గా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అప్పటిదాకా సిటీలో ఉన్న ఆ అమ్మాయికి ఊర్లో ఆస్తి ఉందనే విషయం తెలుస్తుంది. అయితే అదొక మారుమూల గ్రామం. ఆ ఊరికి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తుంది. అడుగు పెట్టగానే ఆమెకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. 20 ఏళ్లుగా ఆ గ్రామాన్ని ఏదో శాపం వెంటాడుతోంది. ఆ ఘోరమైన శాపానికి కారణం ఏంటి ? అసలు హీరోయిన్ కి ఆ శాపంతో ఉన్న లింకు ఏంటి ? అనేది ఈ మూవీ స్టోరీ.

Also Read : యుద్ధం అంటేనే భయం పుట్టించే సినిమాలు… వీటిని చూశాక మాటలు ఉండవు

The Queen of Black Magic (2019)

హనీఫ్ అనే వ్యక్తి, అతని కుటుంబం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. అతను ఫ్యామిలీతో కలిసి తన చిన్నప్పటి అనాథాశ్రమానికి వెళ్తాడు. విషయం తెలిసి అతని చిన్ననాటి స్నేహితులు కూడా అక్కడికి వస్తారు. కానీ రాత్రి అయ్యేసరికి ఆ బిల్డింగ్ లో కంటికి కన్పించని శక్తుల వేట మొదలవుతుంది. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉంటాయి. గతంలో ఆ అనాథాశ్రమంలో ఉన్న ‘మిరా’ అనే అమ్మాయి దానికి కారణం అని తెలుస్తుంది. ఇక వీళ్ళను వెంటాడుతుంది చేతబడి వల్ల వచ్చిన శక్తులు. మరి దెయ్యానికి చేతబడికి ఉన్న లింకు ఏంటి ? హీరో అక్కడి నుంచి ప్రాణాలతో బతికి బయట పడ్డాడా ? అనేది స్టోరీ. ఈ మూడు సినిమాలు కూడా ప్రస్తుతం భారతదేశంలో Amazon Prime Video లో సబ్‌స్క్రిప్షన్‌తో లేదా రెంట్‌కి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×