E-Paper
Advertisement

యాక్షన్ నుంచి హర్రర్ వరకు… ట్రెండింగ్లో ఉన్న థ్రిల్లర్స్ ఇవే

యాక్షన్ నుంచి హర్రర్ వరకు… ట్రెండింగ్లో ఉన్న థ్రిల్లర్స్ ఇవే
Advertisement

Netflix Trending Hollywood films : భారతదేశంలో హాలీవుడ్ చిత్రాలపై వీక్షకుల మోజు రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల కాలంలో నెట్‌ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ జాబితాలో హాలీవుడ్ సినిమాలు ఒక్కటి రెండు కాకుండా ఎక్కువగానే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. యాక్షన్, హారర్, రొమాన్స్, థ్రిల్లర్… ప్రతి జానర్‌లోనూ ఏదో ఒక సూపర్ హిట్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని హాటెస్ట్ హాలీవుడ్ సినిమాల గురించి వివరంగా చూద్దాం పదండి.

1. ఆఫీస్ రొమాన్స్ (Office Romance)

2026 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైన ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ టాప్-10లో చాలాకాలం నుంచి హల్చల్ చేస్తోంది. ఓల్ పార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌స్టీన్ ప్రధాన పాత్రలు పోషించారు. హై-ప్రెజర్ కార్పొరేట్ ఆఫీసులో పని చేసే ఇద్దరు బిజీ ప్రొఫెషనల్స్ మధ్య మొదలయ్యే రహస్య ప్రేమ వ్యవహారం ఎంతో హాస్యంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. ఆఫీస్ మీటింగ్స్, డెడ్‌లైన్స్, సీక్రెట్ డేట్స్ మధ్య ఏర్పడే సిట్యువేషన్స్ మిమ్మల్ని నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తాయి. లైట్ హార్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఈ మూవీ.

2. మెగ్ 2: ది ట్రెంచ్ (Meg 2: The Trench)

Advertisement

‘ది మెగ్’ సీక్వెల్‌ గా వచ్చిన ఈ సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సముద్రపు లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. 25,000 అడుగుల లోతున్న మారియానా ట్రెంచ్‌ లో భారీ మెగలడాన్ షార్క్‌ లు, ఇతర ప్రమాదకర జీవులతో నిండిన ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు ఊపిరి బిగబట్టేలా చేస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్, భయంకరమైన సౌండ్ డిజైన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌ తో థ్రిల్లర్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది ఈ మూవీ.

3. గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ (Godzilla x Kong: The New Empire)

2024లో విడుదలైన ఈ ఎపిక్ యాక్షన్ సై-ఫై థ్రిల్లర్ ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ లో ట్రెండ్ అవుతోంది. గాడ్జిల్లా – కాంగ్ ఈసారి ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా మారి ఒక కొత్త, అత్యంత శక్తివంతమైన శత్రువును ఎదుర్కొంటారు. భారీ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్స్, మాన్స్టర్ యుద్ధాలు… బిగ్ స్క్రీన్ ఫీల్‌ను ఇంట్లోనే ఇవ్వడంలో ఈ సినిమా సక్సెస్ అయింది.

4. ది నన్ 2 (The Nun 2)

Advertisement

‘ది కాంజ్యూరింగ్’ యూనివర్స్‌లో భాగమైన ఈ హారర్ చిత్రం 2023లో విడుదలైనా ఇప్పటికీ భయపడాలనుకునే వారిని ఆకర్షిస్తోంది. 1956 ఫ్రాన్స్‌లోని ఒక బోర్డింగ్ స్కూల్ నేపథ్యంలో సాగే ఈ కథ సస్పెన్స్, మిస్టరీ, భయంకరమైన జంప్ స్కేర్స్‌తో నిండి ఉంటుంది. వాలాక్ నన్ పాత్ర ఇంకా భయంకరంగా తిరిగి వచ్చి ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. హారర్ జానర్ ఫ్యాన్స్‌కి మస్ట్-వాచ్ మూవీ ఇది.

5. ది మార్క్డ్ వుమన్ (The Marked Woman)

స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం బార్సిలోనా నేర ప్రపంచం, మానవ అక్రమ రవాణా చుట్టూ తిరుగుతుంది. ఇందులో మహిళ ప్రధాన పాత్ర కావడం అన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ట్విస్టులు, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్, ఎమోషనల్ డెప్త్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో 10వ స్థానంలో ఉంది. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

Read Also : బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకార దాహంతో రగిలిపోయే ప్రియురాలు… ఇంటెన్స్ రివేంజ్ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×