E-Paper
Advertisement

హంతకులుగా మారే సైకో ప్రేమికులు… పబ్లిసిటీ స్టంట్స్‌ తో పిచ్చెక్కించే సాలిడ్ హాలీవుడ్ థ్రిల్లర్

హంతకులుగా మారే సైకో ప్రేమికులు… పబ్లిసిటీ స్టంట్స్‌ తో పిచ్చెక్కించే సాలిడ్ హాలీవుడ్ థ్రిల్లర్
Advertisement

Crime Thrller Movie OTT : రెండు గంటల పాటు థియేటర్లలో చిల్ అయ్యేలా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే వినోదమే సినిమా. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు మాత్రం చాలా తక్కువ. అలాంటి వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. మనిషి హింసను ఎందుకు ఆస్వాదిస్తాడు? మీడియా దాన్ని ఎలా అమ్ముకుంటుంది? నేరస్తుడిని సమాజం సెలబ్రిటీగా ఎలా మారుస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఇలాంటి వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఒకప్పుడు సంచలనం సృష్టించింది. మరి ఈ మూవీ పేరేంటి ? కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

విడుదలైన మూడున్నర దశాబ్దాల తర్వాత, ఇప్పటికి కూడా ఏమాత్రం వివాదం తగ్గని సినిమానే Natural Born Killers. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఇండియాలో JioHotstar ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కి అవైలబుల్ గా ఉంది. అలాగే Airtel Xstream Play ఓటీటీలో కూడా ఆడియన్స్ ఈ మూవీని వీక్షించొచ్చు. ఈ సినిమా తెరపైకి వచ్చే ముందే కథ కోసం ఏకంగా యుద్ధమే జరిగింది. అసలు స్టోరీని రాసుకుంది ప్రముఖ దర్శకుడు Quentin Tarantino. రా అండ్ రస్టిక్ స్టైల్‌లో, చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ కథను తానే తెరకెక్కించాలని ఆయన ముందుగా అనుకున్నారు.

Advertisement

తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్‌ను Oliver Stone చేతుల్లోకి తీసుకోవడంతో సినిమా కథ పూర్తిగా కొత్తరూపం దాల్చింది. దీంతో ఆ మార్పులు టరాంటినోకు తీవ్ర అసంతృప్తి కలిగించినట్టు సమాచారం. ఆయన చివరకు ఈ సినిమా నుంచి తన పేరును తీసేయాలని డిమాండ్ చేసేదాకా వచ్చింది వివాదం. నిర్మాతలు కూడా చేసేదేం లేక ఆయనకు కేవలం “స్టోరీ క్రెడిట్” మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే… ఈ సినిమాను చూశాక కొంతమంది యువకులపై తీవ్రమైన ఎఫెక్ట్ పడింది. ఆ మూవీ ప్రభావం ఎంతగా పడిందంటే… ఏకంగా నిజ జీవితంలో వరుస హత్యలు చేశారు. ఇందులో ఉన్న బ్రూటల్ సీన్స్ కారణంగా Ireland, United Kingdom, Malaysia వంటి దేశాల్లో ఈ సినిమాను బ్యాన్ చేశారు.

కథలోకి వెళ్తే…

మిక్కీ, మల్లోరి అనే ప్రేమికుల కథ ఇది. చిన్నప్పటి నుంచే కుటుంబ హింస, మానసిక వేధింపులు వంటివి అనుభవించి, చివరికి ఈ ఇద్దరూ రాక్షసులుగా మారతారు. ఎంతగా మారిపోతారు అంటే స్క్రీన్ పై వాళ్ళను చూస్తేనే వణికిపోతాము. మొదట మల్లోరి తన ప్రియుడితో కలిసి తనని వేధించిన తల్లిదండ్రులను చంపేస్తుంది. ఆ తరువాత మొదలవుతాయి బ్రూటల్ మర్డర్స్. రోడ్డుపై ఎవరు కన్పిస్తే వారినే చంపి, దేశాన్ని కుదిపేస్తారు.

Advertisement

ఇలాంటివి జరిగినప్పుడు ఎలాగైనా సరే హంతకులను పట్టుకోవాలని జనాలు, మీడియా కోరుకుంటారు. కానీ ఈ కథలో మాత్రం అసలు విలన్ మీడియానే. ఎందుకంటే వాళ్ళే హంతకులను స్టార్‌లుగా మారుస్తారు. ఎలాగంటే… ఓవైపు పోలీసులు వీరిని పట్టుకోవడానికి దేశమంతా గాలిస్తుంటే, టీవీ ఛానెళ్లు మాత్రం వాళ్లు చేసే హత్యలను లైవ్ లో చూపిస్తూ, రేటింగులు పెంచుకునే ప్రయత్నంలో ఉంటాయి. దీంతో జనాల్లో కూడా ఈ జంటపై వింతగా ఊహించనంత క్రేజ్ పెరుగుతుంది. మరి ఆ తరువాత ఏమైంది అన్నది స్టోరీ.

Read Also : బ్రూస్ లీ కథ ఆధారంగా వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సిరీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×