E-Paper
Advertisement

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా
Advertisement

OTT Movie : కొరియన్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ సినిమాలను మన వాళ్ళు ఆదరిస్తున్నారు. అయితే ఈ మధ్య వీటిని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కొరియన్ సిరీస్ లను చూపు తిప్పుకోకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక భార్య మరొకరిని పెళ్లి చేసుకుంటానని భర్తనే అడుగుతుంది. ఆడగడమే కాదు, ఒప్పించడానికి కూడా ప్రయత్నిస్తుంది. దీంతో ఈ కథ ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘మై వైఫ్ గాట్ మ్యారీడ్’ (My Wife Got Married) ఒక కొరియన్ రొమాంటిక్ సినిమా. జెంగ్ యూన్-సూ దర్శకత్వంలో సన్ యే-జిన్, కిమ్ జూ-హ్యుక్, జూ సాంగ్-వుక్ఉ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2008 అక్టోబర్ 23న కొరియాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

డోక్ అనే యువకుడికి ఫుట్‌బాల్ ఆటను ఎక్కువగా అభిమాణిస్తుంటాడు. దీంతో పెద్దయ్యాక కూడా అతను ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేస్తుంటాడు. ఈ సమయంలో అతను ఇన్ అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమెకు కూడా ఫుట్‌బాల్ ఆట అంటే ఇష్టం ఉండటంతో ఇద్దరూ మాటలు కలుపుతారు. ఆతరువాత చేతులు కూడ కలుపుతారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని దగ్గరవుతారు. ఇక పెళ్లి తర్వాత వాళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక రోజు ఇన్ ఇచ్చే షాకింగ్‌ ట్విస్ట్ కి డోక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆమె జే అనే మరో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవాలని చెప్తుంది.

Read Also : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇన్ కి డోక్ అంటే చాలా ఇష్టం. కానీ జే ని కూడా ఆమె ప్రేమిస్తుంటుంది. ఆమెకు ఇద్దరినీ కోల్పోవడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఇద్దరూ భర్తలుగా కావాలని అనుకుంటుంది. అయితే డోక్ కి ఆమె ప్రతిపాదన నచ్చదు. అయినా కూడా ఇన్ అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. దీంతో కథ ఆసక్తికరంగా నడుస్తుంది. వీళ్లిద్దరి మధ్య జే ఎంట్రీ ఇవ్వడంతో కథ గందరగోళంలో పడుతుంది. చివరికి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏమవుతుంది ? ముగ్గురూ ఒకే బెడ్ షేర్ చేసుకుంటారా ? ఈ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×