E-Paper
Advertisement

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఈ మధ్య కోర్ట్ రూమ్ డ్రామాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ హీరోల నుంచి, కమెడియన్ ల వరకు ఈ కథలతో వస్తున్నారు. ఆడియన్స్ కూడా వీటిని ఆదరిస్తున్నారు. అయితే ఒక గ్రిప్పింగ్ స్టోరీతో వచ్చిన తెలుగు లీగల్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ కథ భార్యని పోగొట్టుకుని, అమెరికా నుంచి వచ్చిన ఒక భారతీయుడి చుట్టూ తిరుగుతుంది. ఇతను ఒక మర్డర్ కేసును వాదించే క్రమంలో స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమింగ్ 

‘లీగల్లీ వీర్’ (Legally veer) 2024లో వచ్చిన తెలుగు లీగల్ థ్రిల్లర్ సినిమా. రవి గోగుల దర్శకత్వంలో మాలికిరెడ్డి వీర్ రెడ్డి, ప్రియాంక రెవ్రి, దిల్లీ గణేష్ , లీలా సామ్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 డిసెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయింది. IMDbలో 6.9/10 రేటింగ్ తో Lionsgate play ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోక్ వెళ్తే

Advertisement

వీర్ రాఘవ అమెరికాలో ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్. తన భార్య ప్రియాతో హ్యాపీగా ఉంటాడు. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నసమయంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. వీర్ భార్య ప్రియా ఒక యాక్సిడెంట్‌లో చనిపోతుంది. దీంతో వీర్ పూర్తిగా డి ప్రెషన్లోకి వెళ్తాడు. ఈ సమయంలో అతను ఇండియాకి వచ్చి తన తల్లిదండ్రులతో సమయం గడుపుతాడు. ఒక లాయర్ గా కొత్త కెరీర్ ను ప్రారంభిస్తాడు. మొదటి సారిగా ఒక మర్డర్ కేసును తీసుకుంటాడు. ఒక అమ్మాయి తన తండ్రిని ఈ కేసులో అనవసరంగా ఇరికించారని బాధపడుతుంది. ఇక వీర్ ఈ కేస్ తీసుకుని, ఆమె తండ్రిని కాపాడడానికి ఫైట్ చేస్తాడు.

Read Also : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

ఒక జూనియర్ లాయర్ మర్డర్ తో మొదలైన ఈ కేసు ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ కేస్ లో పొలిటికల్ అండర్ లో జరిగినట్టు తెలుసుకుంటాడు. అయితే ఈ కేస్ చాలా టఫ్ గా ఉంటుంది. ఒక పొలిటికల్ లీడర్, పోలీస్ ఆఫీసర్ కలిసి ఈ కేసులో ఒక అమాయకున్ని ఇరికించారని వీర్ తెలుసుకుంటాడు. ఇక కోర్ట్ లో ఈ కేసు గురించి వాదనలు బలంగా వినిపిస్తాడు. చివరికి వీర్ కోర్టులో ఈ కేసును గెలుస్తాడా ? ఈ కేస్ వెనుక ఉన్న పొలిటికల్ లీడర్ఎవరు ? నెరస్థుల కుట్రలను వీర్ ఎలా ఫేస్ చేస్తాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Advertisement

 

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×